టాలీవుడ్ లో ఇప్పుడు తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. అంతేకాదు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి భారీ కాన్వాయిస్ ని ఎంచుకున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరెస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఎక్కువ సమస్యలు చుట్టుకుంది ఆర్ ఆర్ ఆర్ కే అని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటునారు. ఇప్పటి వరకు ఈ సినిమాని ఎప్పుడు మొదలు పెడదామా అని ఎదురు చూసిన రాజమౌళి ఇప్పుడు ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నారట. వాస్తవంగా ఈ సినిమాకి భారీ స్థాయిలో నటీనటులు ఇతర టెక్నీషియన్స్ అవసరం ఉంది.
కాని కరోనా నిబంధనలతో చిత్రీకరణ జరపాల్సి ఉంది కాబట్టి వీలైనత తక్కువ మందినే తీసుకుంటున్నారట రాజమౌళి. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య బాలీవుడ్ నటులతో పాటు హాలీవుడ్ నటులు ఈ సినిమాలో నటించాల్సి ఉంది. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలీవుడ్ నుంచి ఆలియా భట్, అజయ్ దేవగన్ లాంటి వాళ్ళే వచ్చి ఆర్ ఆర్ ఆర్ లో జాయినవడం కష్టమని అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ మొదలు పెడితే చిత్రీకరణ ఎలా జరుపుతారన్న సందేహాలు చాలా మందిలో మొదలయ్యాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!