Rakul Preet Sing: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Sing) అందరికీ సుపరిచితురాలే. ఒకప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరో అందరి సరసన నటించిన ఈ పొడుగు కాళ్ళ సుందరి.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎటువంటి పాత్ర అయినా అందుట్లో మంచి కంటెంట్ ఉంటే మాత్రం సీనియర్ హీరోనా.. లేకపోతే ప్రస్తుతం జనరేషన్ కి సంబంధించిన హీరోనా అనే తేడా లేకుండా.. స్టోరీ నచ్చితే ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం గ్యారెంటీ. అతి తక్కువ వయసులోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించడం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) నటించిన ధ్రువ(Dhruva)లో.. హీరోయిన్ గా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకోవడం జరిగింది.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలతో విజయవంతంగా రాణిస్తుంది. రకుల్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. వ్యక్తిగత జీవితంలో చాలా బాగున్నాను. ఇంకా కెరియర్ పరంగా మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఎక్కువ పని చేయాలని ఆరాటపడుతున్నాను. అయితే ఈ విషయంలో ఎన్ని సినిమాలు చేశాను.. అని ఆలోచనతో కాకుండా ఎంత గొప్ప పాత్రలు చేశాను అనే లక్ష్యంతో పనిచేస్తున్నాను అని తెలిపింది. ఎక్కువ సినిమాలతో పాటు మంచి పాత్రలు చేయాలి. అటువంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను అని స్పష్టం చేయడం జరిగింది.
కేవలం నటన మీద ఆసక్తి తోనే ఢిల్లీ నుండి ముంబైకి రావడం జరిగిందని.. ఆరోజు నా దగ్గర కేవలం ఆత్మ విశ్వాసం మాత్రమే ఉంది. అదే నా ఆయుధం. ఎన్ని అడ్డంకులు వచ్చిన ఆత్మవిశ్వాసంతో ఎన్నో విషయాలు అధిగమించాను. మానసికంగా అప్పుడు ఎలాగా ఉన్నానో .. ఇప్పుడు అంతే బలంగా ఉన్నాను. సినిమాలో నేను చేసే పాత్రలపట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు రావాలని ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ క్రమంలో నేను చేసే సినిమా విషయంలో.. నాతోపాటు ఎంతమంది హీరోలు.. హీరోయిన్ లు ఉన్నారు అనేది నేను పెద్దగా పట్టించుకోను. సినిమాలో ఎవరి పాత్ర వారిది, ఏ పాత్రకి ఉండే ప్రాధాన్యం ఆ పాత్రకి ఉంటుంది అంటూ తాజా మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…