Aacharya: చిరంజీవి నట ప్రస్థానంలో ఎన్నో సినిమాలు రికార్డులు సృష్టించాయి. అదేవిధంగా నటనాపరంగా చిరంజీవికి మంచి పేరు తెచ్చిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ కామెడీ పరంగా చిరంజీవికి తిరుగులేదు అని … విమర్శకుల నుండి సైతం ప్రశంసలు తీసుకొచ్చిన సినిమా “చంటబ్బాయ్”. చిరంజీవి తన కెరియర్ ప్రారంభించి అప్పటిదాకా చేసిన సినిమాల లెక్క ఒకటైతే.. “చంటబ్బాయ్” మరో లెవెల్ లోకి తీసుకెల్లింది. ఈ సినిమాలో చిరంజీవి చేసే కామెడీ ఇప్పటికీ కూడా నవ్వు తెప్పిస్తుంటది. ఇదిలా ఉంటె “ఆచార్య” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమా టీం చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా “ఆచార్య”కి సంబంధించి డైరెక్టర్ హరిశ్ చిరు, చరణ్, కొరటాలతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమాకి సంబంధించి అనేక ప్రశ్నలు వేసిన హరీష్… మీ కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ “చంటబ్బాయ్” సినిమా ప్రస్తుతం ఉన్న హీరోలలో ఎవరు చేస్తే బాగుంటుంది అని చిరంజీవినీ ప్రశ్నించారు. అయితే ఈ తరం హీరోల్లో “చంటబ్బాయ్” మూవీ బన్నీ చేస్తే బాగుంటది అని చిరు తెలియజేశారు. మంచి కామెడీ టచ్ ఉన్న రోల్ కాబట్టి.. బన్నీ బాగా చేయగలడు..అంటూ చిరంజీవి సమాధానమిచ్చారు. ఇక ఇదే సమయంలో ప్రజెంట్ ఉన్న హీరోల్లో ఎవరు డాన్స్ బాగా చేస్తారు.. అనే ప్రశ్నకు ఒకరిని కాదు చాలా మందిని చూస్తుంటే.. డాన్సులు ఇరగదీస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వాళ్ళు వీళ్ళు కాదు ఈ రోజుల్లో చాలా మంది బాగా డాన్స్ చేస్తున్నారు. మనవాళ్ళు వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే .. ఆ రీతిగా నేను చేయగలనా..? అనే స్థాయికి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, నితిన్ అందరూ కూడా ఇర్రగాదిస్తున్నరు. ఇక ఇదే సమయంలో “ఆచార్య” సినిమాకి సంబంధించి ఇంకా పలు విశేషాలు.. చిరంజీవితో పాటు చరణ్ కొరటాల ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ తో తెలపడం జరిగింది. ఆచార్య టీం తో హరీష్ శంకర్ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.