NTR: కళ్యాణ్ రామ్ “అమిగోస్” ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. అన్న కళ్యాణ్ రామ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నందమూరి హీరోలలో ఎక్కువ ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ అయిన వ్యక్తి కళ్యాణ్ రామ్ అని అన్నారు. హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా విజయవంతం కావడం సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. “అమిగోస్” అద్భుతమైన విజయం సాధించేలా ఆశీర్వదించాలని కోరారు. ఆస్కార్ అవార్డు వరకు వెళ్లిన.. మరింత సాధించిన అభిమానులే కారణమన్నారు. “RRR” సినిమా క్రెడిట్ రాజమౌళికే దక్కుతుందని తారక్ తెలియజేయడం జరిగింది.
ఈ క్రమంలో కొరటాల సినిమా అప్డేట్ అవ్వాలని అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు. దీంతో ఎన్టీఆర్ కొంత అసహనానికి గురి కావడం జరిగింది. అయినా కానీ తన కొత్త సినిమా కొరటాలతో చేయబోయేది ఈ నెలలో ప్రారంభమై మార్చి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు సినిమా రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిసారి కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వమని మా మీద ఒత్తిడి తీసుకొస్తే మేము నిర్మాతలపై దర్శకులపై ఒత్తిడి తీసుకురావడం వల్ల ప్రయోజనం ఉండదని.. అభిమానులు అర్థం చేసుకోవాలని తారక్ కోరారు. మీరు పెట్టిన ఒత్తిడి మేరకు ఏది పడితే అది అప్ డేట్ ఇస్తే ఒకవేళ అది మీకు నచ్చకపోతే మళ్లీ మీరు నిర్మాతలను దర్శకులను తిడతారు. కాబట్టి ఏదైనా అప్ డేట్ ఉంటే మా ఇంట్లో భార్య కంటే ముందుగా అభిమానులకే చెబుతాము.
ఇది నాకు ఒక్కడికే వర్తించదు. ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరూ ఈ రీతిగానే ఆలోచిస్తారు… దయచేసి అర్థం చేసుకోండి అని అభిమానులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ జేఏసీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ వేడుకలో ఎన్టీఆర్ ఫుల్ గడ్డం లుక్కులో రగ్గడ్ అండ్ స్టైలిష్ గా వైట్ టీ షర్ట్ లో రావటం జరిగింది. ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే సభా ప్రాంగణం మొత్తం జై ఎన్టీఆర్ అనే నినాదంతో అభిమానులు హోరెత్తించారు. అన్నదమ్ములు ఒకే ఫ్రేములో కనిపించేసరికి నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
‘మా’లో మళ్లీ లుకలుకలు!