Intinti Gruhalakshmi: లాస్య నందు ఇంటర్వ్యూ కి వెళ్లాలని హడావిడిగా టిఫిన్ చేస్తూ ఉంటారు.. అందులో లాస్ట్ ఇంటర్వ్యూ అరగంట ముందే అని వస్తుంది.. దానితో నందు తాళం తీసుకుని తన ఇంటర్వ్యూ కి ఆల్ ద బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతుంది.. ఏం చేయాలో తెలియక నందు ఉంటే.. వాళ్ళ అమ్మ నాన్న నీకు ఇంకా వెళ్లి తులసి ని లిఫ్ట్ ఇవ్వమని అడుగు అంటారు.. నేటి ఎపిసోడ్ 522 లో ఏం జరిగిందంటే..!?
522 వ ఎపిసోడ్ హైలెట్స్..
నందు తులసి స్కూటీ ని శుభ్రం చేస్తుండగా అక్కడే నుంచుని చూస్తూ ఉంటాడు.. నందు ఎంతసేపటికి లిఫ్ట్ ఆడకపోవడంతో తులసి నే లిఫ్ట్ కావాలా రండి నేను లాస్య తో చెప్పనులే అంటుంది.. తను వెళ్ళవలసిన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నందు కి ఆల్ ద బెస్ట్ చెప్పేసి తులసి వెళ్ళిపోతుంది. ఇంటర్వ్యూ లో ఇంటర్వ్యూవర్ నందు ప్రొఫైల్ ని పక్కకు పెడుతున్నట్లుగా చెబుతారు. యువ రక్తం కావాలి ఇలా ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవటం లేదు అని చెప్తాడు. నందు ఒక మాట చెప్పనా అంటూ 46 ఏళ్ల వయసులో కూడా ఒక మహిళ తను ఒక ఫ్యాక్టరీ పెట్టి సొంతంగా రన్ చేస్తూ మరో కొంతమంది మహిళలకి ఆదర్శంగా నిలుస్తుంది అంటూ ఇండైరెక్టుగా తులసి గురించి చెప్తాడు.. యువ రక్తంలో ఉడుకు లో ఉండవచ్చుగానీ చల్లారిన రక్తంలో బాధ్యత ఉంటుంది అని చెప్పేసి నందు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు.. అందులో అభి అంకిత అంకిత అంటూ వస్తాడు.. నాకు అర్జెంటుగా 50,000 కావాలి నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటాడు. తులసి ఆంటీ ని అడుగుతాము అని చెబితే వద్దు అమ్మ ఇంకా గొడవ చేస్తుంది. నీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వు మళ్లీ తెచ్చిస్తాను అంటాడు. అంకిత సంక్రాంతికి వస్తుందిగా అప్పుడు ఆంటీ అడుగుతుంది. ఆలోపు ఖచ్చితంగా తెస్తాను అని అభి బంగారం తీసుకొని వెళ్తాడు..
అందులో తులసి ఇంటికి వస్తుంది.. అత్త – మామలతో తులసి మాట్లాడుతుండగా నందు వస్తాడు.. నందు మొహం చిన్నబుచ్చుకుని ఉంటుంది.. ఆ విషయం తులసి గమనిస్తుంది. నందు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నిస్సహాయంగా కూర్చుంటాడు.. రేపటి ఎపిసోడ్ లో నందు లాస్యను టీ పెట్టి ఇవ్వమని అడుగుతాడు. నాకు చిరాకు గా ఉండి నువ్వే పెట్టుకొని తాగు అంటుంది. ఈ లాసిని మరో తులసి ఇలా మార్చి పెత్తనం చెలాయించాలని అనుకుంటున్నావా..!? అది ఎప్పటికీ జరగదు..!! జరగనివ్వను..!! అంటుంది లాస్య. ఇక పూర్తి విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!