న్యూస్ సినిమా

Raviteja: చిరు రిజెక్ట్ చేసిన కథతో మాస్ రాజా రిస్క్ చేస్తున్నడా..!

Share

Raviteja: చిరు రిజెక్ట్ చేసిన కథతో మాస్ రాజా రిస్క్ చేస్తున్నడా..! అంటూ ప్రస్తుతం ఓ న్యూస్ సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. ప్రస్తుతం వరుస చిత్రాలలో నటిస్తూ యమా బిజీగా ఉన్నాడు మాస్ మహారాజ రవితేజ. ఇప్పటికే హీరోగా రామారావు ఆన్‌డ్యూటీ షూటింగ్ పూర్తై రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలను రవితేజ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డే అండ్ నైట్ షూట్‌లో పాల్గొంటున్నాడు.

is raviteja-doing risk with the rejected story
is raviteja-doing risk with the rejected story

అలాగే, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా 154వ సినిమాలో కూడా రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా రవితేజ సరసన నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ చిరుకు తమ్ముడిగా నటిస్తున్నా డు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుందట. మెగాస్టార్ – రవితేజల మధ్యన వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయని సమాచారం.

Raviteja: ‘టైగర్ నాగేశ్వర రావు’ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.

అయితే, రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టూవర్ట్ పురంలో పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను వంశీ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఇదే కథ ముందుకు చిరు వద్దకు వెళ్ళింది. కరోనా సమయం కావడంతో ఆయన ఎందుకో ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయారు. ఒకరకంగా ఆయన రిజెక్ట్ చేసినట్టే అని ప్రచారమూ జరుగుతోంది. మరి అలాంటి కథతో రవితేజ సినిమా చేస్తున్నాడంటే రిస్క్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. కాగా, ఇలా ఒక హీరో రిజెక్ట్ చేసిన ఎన్నో కథలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్‌లను అందుకున్నాయి. చూడాలి మరి రవితేజకు టైగర్ నాగేశ్వర రావు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో.


Share

Related posts

ఆ సీనియర్ హీరో కి ఎలాగైనా హిట్ ఇవ్వాలని డిసైడ్ అయిన పూరి జగన్నాథ్..??

sekhar

Narendra Modi: గవర్నర్ల నియామకం లో మోడీ నయా రాజకీయం!ఇందిరాగాంధీని ఫాలో అవుతున్నారా?

Yandamuri

సేనకో ఆశల దివిటి!! పవన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తారా??

Comrade CHE
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar