NewsOrbit
Entertainment News సినిమా

IT raid’s: మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఐటి రైడ్స్..!!

Share

IT raid’s: బుధవారం ఉదయం నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో కొందరు ప్రముఖుల ఇళ్లపై ఐటి రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రాముఖ్యంగా ఇటీవల గత కొద్ది సంవత్సరాల నుండి ఎన్నో వైవిధ్యమైన భార్య సినిమాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో మైత్రి మూవీ సంస్థ డైరెక్టర్లు నవీన్, రవిశంకర్ ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. వీళ్ళతోపాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ దర్శకులలో ఒకరు సుకుమార్ ఇంటిలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీంతో పుష్ప షూటింగ్ అర్ధాంతరంగా ఆపేసి.. సుకుమార్ ఇంటికి వచ్చేసినట్లు సమాచారం. హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ అర్ధాంతరంగా జరపటం సంచలనం సృష్టించింది.

IT raids director Sukumar's house on Mythri Movie Makers

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు మరి కొంతమంది సెలబ్రిటీ ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు..ఐటీ రిటర్న్‌లలో తప్పుడు వివరాలను అందించినందుకు గాను సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణ యూనిట్ల పన్నులు వాటికి కొనుగోలు ఐటీ రిటర్న్ లలో అవకతవకలు జరిగినట్లు వాటికి సంబంధించిన ఆడిటర్లను ప్రశ్నించడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డైరెక్టర్ సుకుమార్ వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ ఉన్నారు.

IT raids director Sukumar's house on Mythri Movie Makers

నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప సినిమాలు బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం “పుష్ప 2” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్నారు. “పుష్ప 2” సినిమాను రూ. 500 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు నిర్మాతగా కూడా డైరెక్టర్ సుకుమార్ పలు సినిమాలు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఐటి అధికారులు సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాల్లో సోదలు నిర్వహించడం… సంచలనంగా మారింది.


Share

Related posts

Pawan kalyan: పవన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ లేనట్టేనా..?

GRK

ఆ కారణంగానే సినిమాలకు గ్యాప్ వచ్చింది..హీరో వేణు సంచలన కామెంట్స్..!!

sekhar

బిగ్ బాస్ 4 : నోటి దురుసు తో ఈ వారం ఎలిమినేషన్ టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకున్న ఆ కంటెస్టెంట్?

arun kanna