ఏపిలో ఉద్యోగులకు , పెన్షనర్ లకు మేలు కలిగే విధంగా వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తూ వైద్య ఆరోగ్య శాఖ నేడు ఉత్తర్వులు విడుదల చేసింది. ఇకపై ప్రతి ఏటా రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు అందేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులతో పాటు పెన్షనర్ లకు ఈ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ కు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఈహెచ్ఎస్ లోకి పలు చికిత్సలు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులు వివిధ రుగ్మతలతో ఆసుపత్రుల్లో చేరిన సమయంలో ముందుగా డబ్బులు చెల్లించి వైద్యసేవలు పొందాల్సి వస్తుంది. ఆ తర్వాత చికిత్స బిల్లులను పెట్టుకుని రీయింబర్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ ఉద్యోగులకు ఇబ్బందికరం. తాజాగా ప్రభుత్వం 46 రకాల క్యాన్సర్ చికిత్సలను చేర్చడం మంచిపరిణామంగా భావిస్తున్నారు.
అచ్చెన్నకు పోటీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్