Prabhas: “బాహుబలి” సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్.. నిజ జీవితంలో స్నేహం అంటే చాలా విలువ ఇస్తారని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతారు. ముఖ్యంగా తన ఇంటికి ఎవరు వచ్చినా కానీ కడుపునిండా భోజనం పెట్టి మరీ చాలా బాగా ప్రభాస్ చూసుకుంటాడని ఆయనతో క్లోజ్ గా ఉండే చాలామంది చెబుతారు. అనేక ఆడియో వేడుకలలో.. ప్రభాస్ అంటే ఒక నిలువెత్తు కల్మషం లేని మనిషి .. స్నేహం కోసం ఎంతకైనా త్యాగం చేస్తారని .. ఎటువంటి ఇగో లేని వ్యక్తి తగ్గింపు కలిగిన వ్యక్తి ప్రభాస్ అని చెబుతారు.
అంత తగ్గింపు ఉండబట్టే ఇండస్ట్రీలో అంత ఎత్తుకి ప్రభాస్ క్రేజ్ ఎదిగిందని ఆయన గురించి పెద్దలు చెబుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ కమెడియన్ అప్పారావు కూడా .. ప్రభాస్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. “బిల్లా” షూటింగ్ జరుగుతున్న సమయంలో … ఆయన ఒంటరిగా ఒక చోట కూర్చుని ఆ టైంలో ఆయన దగ్గరికి వెళ్లడం జరిగింది.
Read More: Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కెరీర్లో నటించడానికి ఇబ్బంది పడ్డ సీన్ అదేనట..!!
అయితే ఆ సమయంలో వెంటనే కుర్చీలో నుంచి నిలబడి… వెంటనే నాకు కుర్చీ ఒకటి తెప్పించి దానిమీద కూర్చోబెట్టి .. ఆ తర్వాత ప్రభాస్ తన కుర్చీలో కూర్చున్నాడు నిజంగా పెద్దవాళ్ళకి అంత స్థాయిలో ఉన్నాగాని తనకి గౌరవం ఇచ్చాడు అంటూ ప్రభాస్ వ్యక్తిత్వంపై తాజాగా అప్పారావు ప్రశంసల వర్షం కురిపించారు. చాలా విలువైన వ్యక్తిత్వం కలిగిన హీరో ప్రభాస్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!