Kaikala Satyanarayana: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలను నిర్వహించింది. నేటి ఉదయం ఫిల్మ్ నగర్ లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరిగాయి.
కైకాల పెద్ద కొడుకు రామారావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కైకాలను అధికారిక లాంఛనాలతో సగౌరవంగా సాగనంపింది. హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రాజకీయ నేతలు, అభిమానులు కైకాల సత్యనారాయణకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ అంత్యక్రియల్లో మెగాస్టార్ చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, పెద్ద ఎత్తున అభిమానుల పాల్గొని.. తమ అభిమాన నేతకు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!