Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. భువిపై ఉన్న ఈ చందమామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తనదైన అందం, అభినయం అంతకు మించిన ట్యాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది.
తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలు చేసి స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న కాజల్.. 2020 చివర్లో తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. వివాహం తర్వాత సైతం సినిమాలు చేసిన కాజల్.. ఏ ఏడాది తల్లి కాబోతోంది.
ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ ప్రెగ్నెన్సీని ఆమె భర్త గౌతమ్ సోషల్ మీడియా వేదికగా అందరితోనూ పంచుకున్నాడు. దీంతో ఈ దంపతులకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం విషెస్ తెలియజేశారు.ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే కాజల్.. తాజాగా బాల్కానీలో నిలబడి సన్‌రైజ్‌ను ఆస్వాదిస్తూ దిగిన ఓ రెండు ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ `సూర్యుని కిరణాలు నా ముఖాన్ని మృదువుగా తాగుతున్నప్పుడు` అని రాసుకొచ్చింది.
వీటిల్లో బేబీ బంప్‌తో ఉన్న కాజల్ క్రేజీ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలోనే కాజల్ తాజా ఫొటోలను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!