సినిమా

KGF 2: 5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌.. బ్రేక్ ఈవెన్‌కు అతి చేరువ‌లో య‌శ్‌!

Share

KGF 2: క‌న్న‌డ రాక్‌స్టార్ య‌శ్ హీరోగా ప్రముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విల‌న్ పాత్ర‌ను పోషించారు. 2018లో దేశ‌వ్యాప్తంగా ఘ‌న విజ‌యం సాధించిన `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` కు కొన‌సాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

హోంబలి ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రం.. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 14న రిలీజైంది. రిలీజ్ అయిన అన్ని భాష‌ల్లోనూ పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ బ్రేకింగ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దుమ్ముదులిపేస్తోంది.

ఈ నేప‌థ్యంలో య‌శ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు అతి చేరువ‌లో నిలిచాడు. ఐదు రోజులు గ‌డిచే స‌మ‌యానికి ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 311.15 కోట్ల షేర్‌.. రూ. 625.12 కోట్ల గ్రాస్ వ‌సూల్ చేసి బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వాంసం సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా 5 డేస్‌ వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం – 30.63 కోట్లు
సీడెడ్ – 8.17 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 5.34 కోట్లు
ఈస్ట్ – 3.98 కోట్లు
వెస్ట్ – 2.43 కోట్లు
గుంటూరు – 3.25 కోట్లు
కృష్ణా – 2.92 కోట్లు
నెల్లూరు – 1.94 కోట్లు
——————————
ఏపీ + తెలంగాణ = 58.66 కోట్ల షేర్‌ ( 93 కోట్ల-గ్రాస్‌)
——————————

క‌ర్నాట‌క – 58.60 కోట్లు
త‌మిళ‌నాడు – 18.25 కోట్లు
కేర‌ళ – 14.20 కోట్లు
హిందీ – 110 కోట్లు
ఓవ‌ర్సీస్ – 51.40 కోట్లు
—————————-
వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్ = 311.15 కోట్ల షేర్ (625.12 కోట్ల-గ్రాస్‌)
—————————-

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 345 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దూకిన ఈ చిత్రం.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మొద‌టి ఐదు రోజులు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా మ‌రో రూ. 36 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సరిపోతుంది. య‌శ్ దూకుడు చూస్తుంటే మ‌రో రెండు, మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సునాయ‌సనంగా రీచ్ అవుతాడ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.


Share

Related posts

RRR: ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం “RRR” కలెక్షన్స్..!!

sekhar

Prabhas: హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కి రెడీ అవుతున్న ప్రభాస్..!!

sekhar

Jr.NTR – Akhil : జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి అందరూ నవ్వుకుంటున్నారు.. వీడియో వైరల్ చేసిన వర్మ..

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar