Mega Star Chiranjeevi-Gharanamogudu : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇన్ని సినిమాలలో చిరంజీవి మాస్ ఇమేజ్ ను ఇంకొక జనరేషన్ కి తీసుకెళ్లిన సినిమా “ఘరానా మొగుడు” అని చెప్పవచ్చు. ఈ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టింది. అప్పటివరకు ఏ సినిమా రాబట్టిన కలెక్షన్లను చిరంజీవి ఘరానా మొగుడు సాధించగలిగింది. ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవికి జోడిగా నగ్మా నటించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఘరానా మొగుడు సినిమాను కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో హైదరాబాద్, బెంగుళూరు, మద్రాసు, ఊటీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపారు. కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం దాదాపు పది కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అప్పట్లో ఈ సినిమాని అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా చెప్పవచ్చు. బంగారు కోడిపెట్ట అనే పాట అప్పట్లో ఓ రేంజ్ లో పాపులర్ అయింది. అంతకుముందే చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలు గ్యాంగ్ లీడర్,రౌడీ అల్లుడు వంటి సినిమాలు వందరోజుల కలెక్షన్లను ఘరానా మొగుడు కేవలం 50 రోజులలోనే సంపాదించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
ఆ హీరోయిన్ తో లిప్ లాక్ చేసిన Mega Star Chiranjeevi
ఘరానా మొగుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో “పండు పండు”అనే పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు హీరోయిన్ నగ్మా తో మొదటి సారి లిప్ లాక్ సీన్ లో నటించాడు. అయితే ఈ సన్నివేశం షూటింగ్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రంతా చిరంజీవిగారికి నిద్ర పట్టడంలేదట . ఏదో తప్పు చేశానని భావనలో ఉన్నారు.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఎడిటింగ్ జరుగుతున్న సమయంలో స్వయంగా చిరంజీవి గారు ఎడిటింగ్ రూమ్ లోకి వెళ్లి ఆ లిప్ లాక్ సీన్ తానే డిలీట్ చేయించారట. తెలుగులో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మన్నన్ సినిమాకు రీమేక్ . ఈ సినిమా వంద రోజుల వేడుకను గుంటూరులో నిర్వహించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!