RRR: దేశమంతటా RRR ఫీవర్ నడుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా తన సత్తాను చాటుతోంది అనడానికి ఇదే ఉదాహరణ. చల్లటి హిమాలయ దేశం అయినటువంటి నేపాల్ లో RRR వేడి సెగలు పుట్టిస్తోంది. అక్కడ అభిమానులు RRR సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో ఓ మోత మోగిస్తున్నారు. స్క్రీన్ల దగ్గరకు వెళ్లి డ్యాన్సులాడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
RRR: “ఆర్ఆర్ఆర్” ఓటిటికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్..??
RRR: తమిళనాడులో పరిస్థితి:
అలాగే తమిళనాడులోని సేలంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్ వద్ద ఎగబడ్డారు. రాత్రి షో సినిమా టికెట్ల కోసం భారీ సంఖ్యలో జనం థియేటర్ వద్దకు చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల ఎక్కడ చూసినా RRR అభిమానులతో వీధులు, జంక్షన్లు కిక్కిరిసిపోయాయి. చుట్టుపక్కల రోడ్లన్నీ సినిమా ప్రేక్షకులతో జనసంద్రంగా మారాయి. ఆ అభిమాన సంద్రంలో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం కలిగింది.
RRR: యూఎస్ బాక్సాఫీసు వద్ద “ఆర్ఆర్ఆర్” రికార్డుల మోత..!!
సినిమా కలెక్షన్ల పరిస్థితి:
సినిమా కలెక్షన్ల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. రెండు రోజులు కలిపి మొత్తంగా 370 కోట్లను కొల్లగొట్టినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. జక్కన్న ఈ సినిమాను ఏస్థాయిలో తీసాడు అనే విషయాన్ని మనం వర్ణించలేం. సినిమా చూసిన ప్రేక్షకులు బ్రహ్మరథాన్ని పడుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!