Telugu cinimaalu: బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాల సత్తా ఏమిటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. సౌత్ లో అన్ని భాషలతో పాటు నార్త్ లో కూడా మన తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కుతున్నప్పటికీ మన స్టార్ హీరోలందరూ కూడా ఈ చిత్రాల వైపు దృష్టి సారించారు. మన తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తున్న వారిలో కన్నడ ప్రేక్షకులు ఒకరని చెప్పవచ్చు. సాధారణంగా కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటం వల్ల మన తెలుగు సినిమాలు అక్కడ థియేటర్లలో భారీ కలెక్షన్లు కురిపిస్తున్నాయి.
అదే విధంగా టీవీలలో టెలికాస్ట్ అయ్యే మన తెలుగు సినిమాలను( కన్నడ డబ్బింగ్ వెర్షన్లను) వారు ఎక్కువగానే వీక్షిస్తున్నారు.అందుకే కన్నడ నాట తెలుగు సినిమాలకు మంచి టి.ఆర్.పి రేటింగ్స్ నమోదవుతున్నాయి. ఈ విధంగా కన్నడలో ప్రసారం అవుతూ సత్తా చాటిన తెలుగు సినిమాలేమిటో ? ఏ తెలుగు సినిమాలు కన్నడలో ఎంత టి.ఆర్.పి రేటింగ్స్ సంపాదించుకున్నాయో ఇక్కడ తెలుసుకుందాం…
1) సరిలేరు నీకెవ్వరు: మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కన్నడలో 6.5 టి.ఆర్.పి రేటింగ్స్ సంపాదించుకుంది.
2) సైరా నరసింహారెడ్డి: చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా 6.4 టి.ఆర్.పి రేటింగ్స్ సంపాదించుకుంది.
3) సరైనోడు: అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా 6.3 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది.
4) బాహుబలి 1: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 6.3 టి.ఆర్.పి రేటింగ్ సంపాదించింది.
5) రంగస్థలం:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఈ సినిమా 6 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది.
6) మగధీర: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా 5.9 టి.ఆర్.పి రేటింగ్స్ సొంతం చేసుకుంది.
7) బాహుబలి 2: 5.71 టి.ఆర్.పి రేటింగ్
8) గీత గోవిందం: విజయ్ దేవరకొండ హీరో నటించిన ఈ సినిమా 5.6 టి.ఆర్.పి రేటింగ్ సాధించింది
9) అలా వైకుంఠపురంలో: అల్లు అర్జున్ హీరోగా తిరిగి ఎక్కిన ఈ సినిమా 5.34 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుంది.
10) డియర్ కామ్రేడ్: 5.03 టి.ఆర్.పి రేటింగ్
11) అఆ : సమంత నితిన్ జంటగా నటించిన ఈ సినిమా 4.41 టి.ఆర్.పి రేటింగ్ ను సంపాదించుకుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!