సినిమా

Mahesh-Rajamouli Movie: మ‌హేష్-రాజ‌మౌళి సినిమాలో విల‌న్‌గా స్టార్ హీరో.. అత‌నెవ‌రో మీరు అస్స‌ల ఊహించ‌లేరు!

Share

Mahesh-Rajamouli Movie: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం కీర్తి సురేష్‌తో క‌లిసి `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్నాడు. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 1న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

Mahesh Rajamouli Movie Update
Mahesh Rajamouli Movie Update

ఇక‌పోతే మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్ రైట‌ర్ కె. వి. విజయేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ అందిస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె ఎల్ నారాయణ భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మించ‌బోతున్నాడు.

Mahesh Rajamouli Movie Update
Mahesh Rajamouli Movie Update

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ వార్త ఏంటంటే.. ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు విల‌న్‌గా టాలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరో న‌టించ‌బోతున్నాడు. అత‌నెవ‌రో మీరు అస్స‌లు ఊహించ‌నేలేరు. ఇంత‌కీ ఎవ‌రో తెలుసా.. మ్యాచో హీరో గోపీచంద్‌.

Mahesh Rajamouli Movie Update
Mahesh Rajamouli Movie Update

వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించ‌బోయే చిత్రంలో గోపీచంద్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని టాక్‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌ద‌గానీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ వార్త‌ తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, గోపీచంద్ త‌న‌ కెరీర్ స్టార్టింగ్‌లో మ‌హేష్‌కు విల‌న్‌గా `నిజం` సినిమాలో న‌టించాడు. ఈ చిత్రం బాగానే హిట్టైంది.


Share

Related posts

Harihara veeramallu : హరిహర వీరమల్లు లో పవర్ స్టార్ ఎన్ని గెటప్స్ లో కనిపించబోతున్నాడో చూడండి..!

GRK

Pawan Kalyan: త్రివిక్రమ్ అంటే అమితమైన ఇష్టం వుంది, అయినా అతగాడికి అది ఇవ్వలేను: పవన్ కళ్యాణ్

Ram

Ravi Teja : రవితేజ‌ది చీప్ క్యారెక్టర్ అంటూ ఆ డైరెక్టర్ భార్య సంచలన వ్యాఖ్యలు..!

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar