NewsOrbit
Entertainment News సినిమా

Guntur kaaram: “గుంటూరు కారం” గా రాబోతున్న మహేష్… త్రివిక్రమ్ మూవీ..!!

Advertisements
Share

Guntur kaaram: నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి అప్ డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం 6:23 నిమిషాలకు చెప్పిన రీతిగానే “SSMB28” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాకి “గుంటూరు కారం”గా టైటిల్ ప్రకటించి మాస్ స్ట్రైక్ వీడియో ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. ఒక నిమిషం మూడు సెకన్ ల నిడివి గలిగిన ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisements

Mahesh Trivikram movie coming as Guntur Karam

పక్క మాస్ సినిమా అని ఈ వీడియోతో త్రివిక్రమ్ తేల్చేశాడు. నోట్లో బీడీ వెలిగించుకుని మహేష్ బాబు రావటం.. తో పాటు ఏందట్టా చూస్తున్నావ్… బీడీ త్రీడీలో కనబడుతుందా.. అంటూ మహేష్ తనదైన స్లాంగ్ లో డైలాగ్ చెప్పటంతో.. అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పక్కా డీ గ్రేడ్ మాస్ తరహా హీరోగా మహేష్ బాబుని సరికొత్తగా మరోసారి త్రివిక్రమ్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తమన్ అందించిన మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్ పాత్రలలో కనిపిస్తున్నారు.

Advertisements

Mahesh Trivikram movie coming as Guntur Karam

గతంలో త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లలో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. “గుంటూరు కారం” గా రాబోతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 13వ తారీకు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పల్నాడు నేపథ్యంలో సరికొత్త తరహా స్టోరీతో మహేష్ బాబుని చూపించబోతున్నట్లు సమాచారం. తెలుగు చలనచిత్ర రంగంలో ఇప్పటివరకు కోనసీమ లేదా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి సినిమాలు ఎక్కువగా వచ్చాయి. అయితే త్రివిక్రమ్ కొత్తగా పల్నాడు టచ్ తో మహేష్ ని సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.


Share
Advertisements

Related posts

పవన్ బర్త్ డే కి సంబంధించి ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్..!!

sekhar

క్లియర్ కట్ ఇన్‌ఫర్మేషన్ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. ఇక అలాంటి రూమర్స్ కి నో ఛాన్స్ ..?

GRK

Ante Sundaraniki: ఆ టైంలో తట్టుకోలేక మందు తాగేసా నాని వైరల్ కామెంట్స్..!!

sekhar