Ustaad Bhagat Singh: డైరెక్టర్ తేజ ఇటీవల దగ్గుబాటి అభిరామ్ నీ హీరోగా పరిచయం చేస్తు “అహింస” అనే సినిమా చేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ లేటెస్ట్ మూవీ “ఉస్తాద్ భగత్ సింగ్” పై డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ గురించి తేజ మాట్లాడుతూ…”ఉస్తాద్ భగత్ సింగ్” టీజర్ ఇటీవల విడుదలైంది అది ఎంతగానో నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అట్లుండాలి. ట్రైలర్ చూడగానే అర్థమయిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని తెలిసిపోతుంది.. అంటూ తేజ కామెంట్లు చేయడం జరిగింది.
“అహింస” ప్రమోషన్ కార్యక్రమాలలో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో సినిమా అయితే ఎలాంటి కథ సిద్ధం చేస్తారని…ప్రశ్న వేయగా.. తేజ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. ఈ వీడియోని హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి రీట్వీట్ చేసి… థాంక్యూ తేజ గారు అంటూ కామెంట్ చేశారు. హరిష్ శంకర్ దర్శకత్వంలో గతంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 2012 లో వచ్చిన “గబ్బర్ సింగ్” పవన్ కెరియర్ లో అత్యధికమైన కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. “ఖుషి” తర్వాత ఆ స్థాయి విజయం సాధించిన సినిమాగా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.
మళ్లీ వీరి కాంబినేషన్ లో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” పై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవటం జరిగింది. ఇదిలా ఉంటే తాగాక ఈ సినిమాలో కొత్తగా పొలిటికల్ ఎపిసోడ్ కి సంబంధించి సరికొత్త డైలాగ్స్ హరీష్ రాసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయ జర్నీకి ఉపయోగపడేలా… డైలాగ్స్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు పవన్ ప్రత్యర్థులకు దిమ్మతిరిగే కౌంటర్స్ ఉండే విధంగా డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా స్ట్రాంగ్ గా డైలాగులు రాసినట్లు వార్తలు వస్తున్నాయి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!