Game Changer: నేడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ బర్తడే నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తండ్రి చిరంజీవికి తగ్గ తనయుడిగా చరణ్ సినీ ప్రయాణం ఉన్నత శిఖరాలను నిర్వహిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది. “RRR” తో చరణ్ గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా అదే రేంజ్ లో ఉండేలా చిత్రీకరణ జరుగుతుంది. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “గేమ్ చేంజర్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కొద్ది నిమిషాల క్రితం మేకర్స్ ప్రకటించడం జరిగింది.
ఈరోజు 03:06 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీయారా అద్వానీ నటిస్తోంది. సునీల్, ఎస్ జె సూర్య.. మరి కొంతమంది కీలక పాత్రలో కనిపిస్తున్నారు. టైటిల్ ప్రకటన చాలా వెరైటీగా ఉండటంతో.. డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే చరణ్ సినిమా ఉంటున్నట్లు ఫాన్స్ భావిస్తున్నారు. ఫస్ట్ నుంచి ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. అందులో ఒకటి కలెక్టర్ పాత్రని మరొకటి ముఖ్యమంత్రి పాత్ర… ఇంకా మూడోది కుర్రాడి పాత్రలో చరణ్ ని చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తం మీద చూసుకుంటే పొలిటికల్ నేపథ్యంలో మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో.. ఒక సాంగ్ లో కొన్ని వందలాదిమంది డాన్సర్లతో చరణ్ వేసిన స్టెప్పులు చాలా హైలెట్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ కీ జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేశారు. కచ్చితంగా చరణ్ కెరియర్ లో ఇది హైలైట్ అవుతుందని సాంగ్ చిత్రీకరణ సమయంలో తెలియజేయడం జరిగింది. సౌత్ ఇండియాలోనే శంకర్ అతిపెద్ద దర్శకుడు కావడంతో “గేమ్ చేంజర్” సినిమాపై అభిమానులకే కాదు మిగతా సినీ ప్రేమికులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.