Malavika mohan: ప్రభాస్ – మారుతి సినిమాకు క్రేజీ హీరోయిన్ ఫిక్స్..ఆమెకు హ్యాండిచ్చినట్టేనా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ మొదలవుతుందీ అంటే అన్నిటికంటే ముందుగా వచ్చేది హీరోయిన్ ప్రస్తావనే. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే, ఆ హీరోయిన్ అయితే ప్రభాస్‌తో బావుంటుంది..ఈ హీరోయిన్ అయితే బావుంటుందీ అని మాట్లాడుకుంటుంటారు. కానీ, ప్రభాస్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియన్ సినిమాలు. కాబట్టి హీరోయిన్ కూడా ఆ రేంజ్ ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కనీసం రెండు భాషలలోనైనా స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ను ఫిక్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ – మారుతి కాంబినేషన్లో మొదలవబోయే చిత్రానికి తమిళ హాట్ బ్యూటీని పరిశీలిస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. దీని తర్వాత ఆదిపురుష్, సలార్ చిత్రాలు రానున్నాయి. ఇక ఇప్పటికే ఆదుపురుష్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్, సలార్, ప్రాజెక్ట్ k సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఆయన హీరోగా చేయనున్న స్పిరిట్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్..ప్రాజెక్ట్ k మీద ఆధారపడి ఉందని టాక్ వినిపిస్తోంది.
Malavika mohan: అందుకే ప్రభాస్ సరసన మాళవిక..?
ఇదిలా ఉంటే, ప్రభాస్ కోసం ఓ క్రేజీ సబ్జెక్ట్‌ను దర్శకుడు మారుతి సిద్దం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తవగా ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఈ కాంబోలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్గా మాస్టర్ సినిమాతో సౌత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మాళవిక మోహన్‌ను హీరోయిన్గా ఎంపిక చేసినట్టు సమాచారం. మాళవికకు సౌత్ ఆడియన్స్‌లో అలాగే, నెటిజన్స్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన గ్లామర్ ఫొటో షూట్స్‌తో నిత్యం నెట్టింట సందడి చేస్తున్న మాళవిక అందాలకు ముగ్ధులవుతున్న వారెందరో.
ఒక్క తెలుగు సినిమా చేయకపోయినా కూడా మాళవిక కోసం టాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. అందుకే ప్రభాస్ సరసన మాళవికను ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. అదే నిజమైతే ప్రభాస్ – మారుతి సినిమాలో ఆమె ఇచ్చే గ్లామర్ ట్రీట్ మామూలుగా ఉండదని చెప్పుకుంటున్నారు.అయితే, ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి మెహ్రీన్ ఇందులో నటించేందుకు ఆసక్తి చూపించిందని..మారుతిని కూడా రిక్వెస్ట్ చేస్తుందని వార్తలు వచ్చాయి. దాదాపు ఆమెనే మారుతి ఫిక్స్ చేస్తారని టాక్ వినిపించింది. కానీ, ఇప్పుడు హ్యాండ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!