28.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
సినిమా

‘మన్మథుడు 2’ కథ ఇదేనా!

Share

కింగ్‌ నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా సీక్వెల్సే కావడం విశేషం. ఒకటేమో మన్మథుడు సీక్వెల్‌ మన్మథుడు 2 కాగా.. మరొకటేమో సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్‌ ‘బంగార్రాజు’. ఈ రెండింటికీ నాగార్జునే నిర్మాత. ప్రస్తుతం ‘మన్మథుడు 2’ షూటింగ్‌ పోర్చుగల్‌లో జరుగుతుంది. రీసెంట్‌గా డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ సినిమా కోసం నాగార్జున చేస్తోన్న ఎక్సర్‌ సైజ్‌ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి నాగ్‌ ఫిట్‌నెస్‌ను పొగిడాడు.
ఈ సినిమా విషయంలో ఓ వార్తొకటి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది. అదేంటంటే.. ‘మన్మథుడు 2’లో నాగ్‌కు నలుగురు చెల్లెళ్లు ఉంటారట. వీరికి పెళ్లిళ్లు చేసేసరికి నాగ్‌కి వయసు అయిపోతుందట. నలభై ఏళ్ల వయసులో నాగ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ వెనుక పడటం.. దాని ఫలితంగా వచ్చే కామెడీతో సినిమా ఆసాంతం ప్రేక్షకులను నవ్వించేలా దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమాలో సోనాలి బింద్రే కూడా చిన్న పాత్రలో కనిపిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో సమంత అక్కినేని అతిథి పాత్రలో నటిస్తుంది.


Share

Related posts

Sarkaru Vaari Paata: సరిగ్గా నెలరోజులు..బాబుకి ఈసారికి కలిసొచ్చేనా..?

GRK

రవితేజ‌కి ముహూర్తం కుదిరింది.

Siva Prasad

“రాధే శ్యామ్” ఫస్ట్ లుక్ లో సర్‌ప్రేజ్ కాదు ట్విస్టులు ఇచ్చాడు ప్రభాస్ ..!

GRK

Leave a Comment