NTR 30: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్తడే నేపథ్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయటానికి కొరటాల శివ సిద్ధమవుతున్నారు. “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
విశాఖపట్నంలో ఎన్టీఆర్.. సైఫ్ అలీ ఖాన్ లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నాలజీని వాడుతున్నారు. “RRR” సినిమాతో ప్రపంచ స్థాయిలో ఎన్టీఆర్ కి మంచి గుర్తింపు రావడంతో… అదే రీతిలో ఈ సినిమా ఉండే విధంగా కొరటాల శివ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. పాన్ వరల్డ్ వైడ్ గా “NTR 30” సినిమా ఉండేలా చూసుకుంటున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో చిరస్థాయిగా నిలిచిపోయేలా కథ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగింది.
అయితే మే 20వ తారీకు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా… ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడిన టైటిల్ ప్రకటించే యోచనలో సినిమా యూనిట్ రెడీ అయింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “జనతా గ్యారేజ్” అనే సినిమా వచ్చింది. 2016వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ రెండో సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.