Blackberry Benefits: బ్లాక్‌బెర్రీస్ లో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి, మనకు ఎక్కువగా దొరికే మల్బరీ పండ్లలాగా కనపడే ఈ బ్లాక్‌బెర్రీస్ ఆరోగ్య వంతమైన జీవితం గడపడానికి కావాల్సిన అన్ని పోషకాలు కలిగి ఉన్న పండ్లు, ప్రక్రుతి మనిషికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఈ బ్లాక్‌బెర్రీస్.

తీపి ప్రియులకు తియ్యని కబురు
ఆరోగ్యం గురించి ఆలోచన ఉన్న ఎవరైనా మొదట ఆలోచించే విషయం తీపి తినాలా వొద్దా అని. కానీ ఎలాంటి ఆలోచన లేకుండా బ్లాక్‌బెర్రీస్ తో మీ తీపి తినాలి అనే కోరిక తీర్చుకోవొచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే తీపి ఆరోగ్యానికి హానికరమైన తీపి కాదు, అధిక బరువు లేదా చెక్కర వ్యాధి లాంటి సమస్యలు ఉన్న వారు కూడా ఈ బ్లాక్‌బెర్రీస్ ని చక్కగా తినవొచ్చు. దీనికి కారణం బ్లాక్‌బెర్రీస్ కి ఉన్న లో గ్లిసెమిక్ ఇండెక్స్, అంటే అవి తిన్న తరువాత శరీరం లో బ్లడ్ షుగర్ వెంటనే పెరగదు అనమాట. బరువు తగ్గాలి అని ఫిట్నెస్ గురించి ఆలోచించే వారు బ్లాక్‌బెర్రీస్ ని ఎండ పెట్టుకుని ఎందులో అయినా కలుపుకుని తినొచ్చు.
బ్లాక్‌బెర్రీస్ Vs ఇండియన్ బ్లాక్‌బెర్రీస్ Vs మల్బరీ
బ్లాక్‌బెర్రీస్ అంటే ఇండియన్ బ్లాక్‌బెర్రీస్ కాదు. ఇండియన్ బ్లాక్‌బెర్రీస్ అంటే నేరేడు పండ్లు. అయితే బ్లాక్‌బెర్రీ లో ఉన్న చాలా పౌషకాలు ఇండియన్ బ్లాక్‌బెర్రీ(నేరేడు) పండ్లలో కూడా ఉంటుంది. చాలా మంది మల్బరీ ని చూసి కూడా బ్లాక్‌బెర్రీస్ అని పొరపడతారు కానీ అవి రెండు వేరు. మల్బరీ పండ్లు చూడటానికి బ్లాక్‌బెర్రీస్ లాగానే ఉంటాయి కానీ రుచి లో వేరు. ఈ మూడు బెర్రీ పండ్లు మంచివే అయినప్పడికి మనం ఇక్కడ బ్లాక్‌బెర్రీ ఆరోగ్య ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం…

బ్లాక్‌బెర్రీస్ డయాబెటిస్ కి చెక్ పెట్టండి
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనుషులు బ్లాక్‌బెర్రీస్ ని కొన్ని వేల సంవత్సరాల నుండి తింటున్నారు. అడవిలో ఆది మానవుడిగా ఉన్నప్పటినుంచి మనం బ్లాక్‌బెర్రీస్ ని వెతికి మరీ తినేవాళ్ళం అట ఎందుకంటే అన్ని ఆరోగ్య ప్రయాజనాలు ఉన్నాయి మరి ఇందులో. డయాబెటిస్ లో కీలక పాత్ర పోషించే ఇన్సులిన్ ని కూడా ఈ బ్లాక్‌బెర్రీస్ తో మనం అదుపులో ఉంచవొచ్చు, పైన వీటికున్న లో గ్లిసెమిక్ ఇండెక్స్ గురించి మనం ముందే మాట్లాడుకున్నాం.
క్యాన్సర్ నుండి కాపాడే గుణం
అవును బ్లాక్‌బెర్రీస్ కి యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. అంటే మన శరీరం లో కాన్సెర్ వొచ్చే అవకాశాలను తగ్గించ గలిగే శక్తి బ్లాక్‌బెర్రీ పండ్లకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి కారణం బ్లాక్‌బెర్రీస్ కి ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు. మన శరీరం లో విచ్చల విడిగా తిరిగే ఫ్రీ రాడికల్స్ లి అదుపు చేసి క్యాన్సర్ ని నివారిస్తూ ఆరోగ్యాంగా ఉండేలా చేస్తాయి.
ఆడవారికి ముఖ్యంగా గర్భవతులకు బ్లాక్‌బెర్రీస్ ఒక పెద్ద వరం
నెలసరి వల్ల ఆడవారికి కలిగే రక్తస్రావం అలాగే గర్భవతులకు జరిగే బ్లీడింగ్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ అద్భుత పండు. ప్రెగ్నన్సీ అప్పుడు ఇవి తినడం వలన రక్త సరఫరా పెరుగుతుంది. పుట్టబోయే పిల్లల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. శిశువు గుండె ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం చక్కగా ఉంచుతూ ప్రెగ్నన్సీ కోల్పోవడం లాంటి సంఘటనలు తగ్గిస్తుంది.

చదువుకునే పిల్లలకు ఇది మెదడుకు మేత
మీరు కంపెటేటివ్ ఎగ్జామ్స్ అయినా లేదా సాధారణ పిల్లల స్కూల్ పరీక్షల అయినా మీకు కావాల్సింది చురుకుగా పని చేసే మెదడు. ఆ విషయం లో బ్లాక్‌బెర్రీస్ ని మించిన మెదడుకు మేత ఇంకొకటి లేదు అని చెప్పాలి. బ్లాక్‌బెర్రీస్ లో ఉండే పోలీఫెనాల్స్ అనే పదార్ధాలు మనిషి మెదడును చురుకుగా ఉండేట్లు చేస్తుంది. ఎలుకల మీద శాస్త్రవేత్తల జరిపిన ప్రయోగాల్లో ఈ విషయం బయట పడింది.
Black Coffee With Ghee: బ్లాక్ కాఫీ లో నెయ్యి కలిపి తాగడం వలన ఇన్ని ఆరోగ్య లాబలా? నెయ్యి కాఫీ తో నమ్మలేని ప్రయోజనాలు!
బ్లాక్‌బెర్రీస్ లో అద్భుత ఆరోగ్య రహస్యాలు
మనం మాములుగా తినే అన్నం లాంటి రోజు వారి తిండి లో మనకు కావాల్సిన శక్తి దొరుకుంది. కానీ చాలా ముందుకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు రోజువారి ఆహారం లో దొరకదు. ఆ విషయానికి వొస్తే బ్లాక్‌బెర్రీస్ సూక్ష్మ పోషకాలు గుప్త నిధి. విటమిన్ సి, విటమిన్ కే, మాంగనీస్, ఐరన్, కాల్షియమ్ లాంటి ఎన్నో పౌషకాలు ఉంటాయి. ప్రతి 100 గ్రాముల బ్లాక్‌బెర్రీస్ లో 5 నుంచి 6 గ్రాముల ఫైబర్ కూడా ఉండడం మీ పొట్టకు చాలా మంచిది. అంతే కాదు బ్లాక్‌బెర్రీస్ లో ప్రోటీన్ కూడా ఉంటుంది అని మీకు తెలుసా.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుచి సాయంత్రం స్నాక్స్ లేదా రాత్రి డిన్నర్ వరకు బ్లాక్‌బెర్రీస్ ని మీరు ఎప్పుడైనా తినొచ్చు. లేదా ఫ్రూట్ సలాడ్, జిమ్ కి వెళ్లి వొచ్చిన తరువాత తాగే స్మూతీ, ఇలాంటి తాగే వాటిలో కూడా తియ్యదనం కోసం బ్లాక్‌బెర్రీస్ ని కలుపుకోవొచ్చు. అటు రుచికి రుచి ఇటు ఆరోగ్యం ఇంకెదుకు ఆలస్యం ఇప్పుడే తెచ్చుకుని తినండి మరి…బ్లాక్‌బెర్రీస్ విషయం లో ఆలస్యం చేయకండి ఆలోచించకండి రోజూ తినడం అలవాటు చేసుకోండి.