మాటల మాంత్రికుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్…

Share

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ సైరా నరసింహా రెడ్డి. చాలా ప్రేస్టిజీయస్‌గా తీసుకోని కొనిదెల ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ అయింది. అయితే సైరా సెట్స్ పైన ఉండగానే మరో సినిమాని లైన్లో పెట్టాడు చిరు. ఇటీవలే జరిగిన వినయ విధేయ రామ సినిమా ఆడియో పంక్షన్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన నెక్ట్స్ సినిమా ఉంటుందని చెప్పాడు మెగాస్టార్. కానీ మెగాస్టార్ త్రివిక్రమ్ కాకుండా మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని టాలీవుడ్ సర్కీల్‌లో హాట్ డిస్కషన్ నడుస్తోంది.

అయితే త్రివిక్రమ్, బన్నితో సినిమా చేయబోతున్నాడు. కాబట్టి ఈ గ్యాప్‌లో ముందుఅనుకున్నట్టు హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నాడట. ఓ సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తు మంచి స్టోరీని రెడీ చేశాడట కొరటాల. రైతుల సమస్యల నేపథ్యంలో కథని రెడీ చేశాడట. ఈ కథ కూడా చిరుకు తెగ నచ్చేసిందట. అంతేకాదు ఇందులో మెగాస్టార్ డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నాడని సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాని ఈ నెలల్లోనే మొదలు పెట్టాలకున్నారు. కానీ రామోజీ ఫిల్మ్ సిటిలో వేసిన విలేజ్ సెట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ కావడానికి ఇంకా టైం పడుతుంది. కాబట్టి కొరటాల సినిమాని వేసవిలో స్టార్ట్ చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మించబోతున్నాడట. కొరటాల సినిమా తరువాత త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందట. మరి మంచి కథతో సినిమాలు తీసు ప్రేక్షకులను మెప్పిస్తు హిట్స్‌తో దూసుకుపోతున్న కొరటాల.. చిరు కాంబినేషన్‌తోనూ ఆ పరంపరని కొనసాగిస్తాడేమో చూడాలి.


Share

Related posts

నితిన్ ‘భీష్మ` ప్రారంభం

Siva Prasad

రష్మిక విషయంలో రూమర్..దర్శకుడే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది ..?

GRK

ఫిబ్రవరి 22న “ప్రేమ‌క‌థాచిత్రమ్ 2” గ్రాండ్ రిలీజ్

Siva Prasad

Leave a Comment