ప్రస్తుతం టాలీవుడ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా నటిస్తున్నాడు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఖర్చుకు ఎక్కడా వెనుకడాకుండా చాలా ప్రేస్టేజియస్‌గా భారీ కాస్టింగ్ తో.. హైటెక్నికల్ వ్యాల్స్‌తో పక్కా ప్లానింగ్‌తో నిర్మిస్తున్నాడు.అయితే ఇప్పుడు ఈ క్రెజీ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఈ సినిమాలో వచ్చే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు ఉత్కంఠతను కలిగిస్తాయని తెలుస్తోంది. అంతేకాదు బ్రిటిషుకాలం నాటి అట్మాస్పీయర్ కోసం భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే సగనికి పైగా సినిమా షూట్ చేశారట. అయితే ఈ సినిమా ఫస్ట్ సీన్స్‌ని ఇంట్రెస్టింగ్గా ఉండేలా పెదరాశి పెద్దమ్మ సినిమా తరహాలో నరసింహా రెడ్డి గురించి ఒక ముసలావిడ కొంతమందికి కథ చెబుతుండగా మూవీ మొదలు అవుతుందట. సైరా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న కొంతమందికి ముసలావిడ చెప్పే సిన్స్ వచ్చేలా చేసి, రాబోయే సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచేలా చూస్తున్నారట చిత్రటీమ్. అంతేకాదు టాలీవుడ్లో ఇప్పటి వరకు రానినట్టువంటి ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం రామోజీ పిల్మ్ సిటిలో వేసిన ఓ సెట్లో షూటింగ్ జపుకుంటుంది.ఇక్కడ అండర్ వాటర్‌లో జరిగే భారీ ఫైట్ సీన్స్‌ని హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ అధ్యర్యంలో షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి గ్రాఫిక్స్ కూడా హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు, మోషర్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. నిజానికి ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉండగా, షూటింగ్ పార్ట్ డిలే అయినా పర్లేదు క్వాలిటీ తగ్గకూడదని జాగ్రత్తగా వర్క్ చేస్తుండడంతో సినిమా విడుదల మరింత ఆలస్యమవుతుందని అనుకుంటున్నారు. సైరా రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఏవేవో రూమర్స్ వినిపించడం మొదలయ్యాయి, వీటికి ఫుల్ స్టాప్ పెడుతూ చిత్ర నిర్మాత కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ తేజ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం వినయ విధేయ రామ పనుల్లో బిజీగా ఉన్న చరణ్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరో రెండు-మూడు నెలల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి, దసరా కానుకగా సైరాని విడుదల చేస్తామని స్పష్టం చేశాడు. సో ఇప్పటి వరకూ సినిమాపైనే వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమేనని సైరా విజయదశమికి ప్రేక్షకుల ముందుకి వచ్చి విజయాన్ని అందుకుంటాడని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!