భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితగాథలో తెలియని కోణాలను ఆవిష్కరించేలా ఓ బయోపిక్ రూపొందుతోంది. `మన్ బైరాగి` పేరుతో ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలి, మహావీర్ జైన్లు నిర్మిస్తున్నారు. సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. దీని తెలుగులో `మనో వైరాగి` పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా తన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. మోదికి పుట్టినరోజు శుభాకాంక్షలను, చిత్ర యూనిట్‌కు అభినందనలను తెలిపారు ప్రభాస్. ఇది వరకే నటుడు వివేక్ ఒబెరాయ్ మోదీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని `పి.ఎం.నరేంద్రమోది` అనే బయోపిక్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. మోదీపై రూపొందుతోన్న రెండో బయోపిక్ ఇది.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!