(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఈసారి కోటి రూపాయలు కొట్టేసిన వ్యక్తి ఎవరో తెలుసా. పహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో పనిచేసే ఓ వంటమనిషి ఆ ఘనత సాధించింది. ఈ సీజన్ మొదటి కరోడ్‌పతి సనోజ్ రాజ్ బీహార్‌కు చెందిన వ్యక్తి. యుపిఎస్సి పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలన్నది అతని ఆకాంక్ష. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నడిపించే కౌన్ బనేగా కరోడ్‌పతి దేశంలో అత్యంత పాపులర్ టివి షో. ప్రస్తుతం కౌన్ బనేగా 11వ సీజన్ నడుస్తోంది.
https://www.facebook.com/sonytelevision/videos/2398820766822469/
సోనీ ఎంటర్టైన్మెంట్ వారు ఈ సీజన్ రెండవ విన్నర్ గురించి ఒక ప్రోమో విడుదల చేశారు. మహారాష్ట్రలోని ఒక స్కూలులో మధ్యాహ్న భోజన పధకం కోసం వంట చేసే బబితా తాడే సక్సెస్ స్టోరీ అందులో కనబడుతుంది. ఆమె నెలకి సంపాదించేది 1500 రూపాయలు మాత్రమే. అయినా తాను చేసే పని అంటే తనకు గర్వమని ఆమె అంటున్నది.