‘అదిరింది’ షో వల్ల జడ్జి నాగబాబు ని బండబూతులు తిడుతున్నారు..! వీళ్ళ బాధ ఏమిటో అర్థం కాదు….

బుల్లితెరపై కామెడీ షో లు వచ్చి ఒక్కసారిగా ఆట స్వరూపాన్ని మార్చివేశాయి. సీరియళ్లకు పోటాపోటీగా టిఆర్పి రేటింగ్ లను కామెడీ షో లు సాధిస్తాయని ముందు ఎవరూ ఊహించలేదు. అయితే జబర్దస్త్ లాంటి షో లు చూపిస్తున్న హవా ఈ మధ్యకాలంలో మామూలుగా లేదు. కానీ జబర్దస్త్ రేంజ్ ను అందుకునేందుకు ఎన్నో షో లు వచ్చినప్పటికీ ఏవి అంత హిట్ కాలేదు. 

 

అయితే మెగా బ్రదర్ నాగబాబు సారధ్యంలో వస్తున్న ‘అదిరింది’ మాత్రం జబర్దస్త్ కు బాగా పోటీ గా నిలుస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ షో కి అదే రేంజ్ లో కష్టాలు ఎదురవుతున్నాయి. జబర్దస్త్ లో మేటి దర్శకులు అయిన నితిన్, భరత్ అక్కడికి గుడ్ బై చెప్పేసి నాగబాబు మద్దతు తో మరో ఛానెల్ లో అదిరింది షో ప్రారంభించారు. 

ఇక జబర్దస్త్ లోని కొంతమంది టీమ్ లీడర్లను, మాజీ ఆర్టిస్టులను ఇందులోకి లాగేసారు. మొదట్లో అదిరింది షో కి రేటింగ్ బాగానే వచ్చింది…. అయితే నిదానంగా ప్రేక్షకుల ఆదరణ కోల్పోయింది. బొమ్మ అదిరింది అని కొత్తగా పెట్టిన ఫార్మాట్ కి అయితే భారీగా రెస్పాన్స్ వచ్చేసింది. ఇక ఈ షో కి శ్రీముఖి యాంకరింగ్ చేయడం, పలువురు ప్రముఖులు విచ్చేయడం కలిసొచ్చింది. నవదీప్ వదిలిపోగా నాగబాబు జడ్జీ గా కొనసాగుతున్నారు. జానీ మాస్టర్ తన వంతు సహాయం అందిస్తున్నాడు. 

ఇక జబర్దస్త్ లో లాగా అదిరింది స్కిట్లు యూట్యూబ్ లో అప్ లోడ్ కావడం లేదు. ఇది కొద్దిగా మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే అదిరింది వచ్చే జీ ఛానల్ కు zee5 అనే ప్రత్యేకమైన ఓటిటి ప్లాట్ఫారం ఉంది. ఇక అందులో స్కిట్లు చూడాలంటే మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదిరింది ఫాన్స్ యూట్యూబ్ స్కిట్లు అప్లోడ్ చేయడం లేదని యూనిట్ పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ప్రోమో కామెంట్ సెక్షన్ లో అందరూ నాగబాబు పై ఫైర్ అవుతున్నారు. షో జడ్జ్ మెగా బ్రదర్ నాగబాబుతో పాటు షో నిర్వహకులను బండ బూతులు తిడుతున్నారు.