సీనియర్ హీరోయిన్ నగ్మ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. మరో వైపు సినిమా రంగానికి దూరంగా ఉన్న ఈమె తిరిగి సినిమాల్లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో టాలీవుడ్ నిర్మాతలు కలిస్తే.. కొన్ని మార్పులు సూచించిన నగ్మ.. ఆ మార్పులు నచ్చితే తెలుగులో మళ్లీ సినిమా చేస్తానని చెప్పింది. మరి బన్ని, త్రివిక్రమ్ చిత్రంలో బన్ని తల్లి పాత్రలో నటించబోతున్నారట కదా! అని రీసెంట్ ఇంటర్వ్యూలో అడిగితే అలాంటిదేం లేదని.. తనను బన్ని సినిమాలో నటించమని ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చింది. అసలు ఎవరు ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారో తెలియడం లేదంటూ వాపోయింది. దీంతో బన్ని సినిమాలో నగ్మ నటిస్తుందనే వార్తలు పుకార్లేనని తేలిపోయాయి.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!