Nbk-Ntr: బాలకృష్ణ-ఎన్టీఆర్ Nbk-Ntr తెలుగు సినిమాల్లో కాంబినేషన్లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. హీరో-దర్శకుడు, హీరో-హీరోయిన్, హీరో-బ్యానర్.. ఇలా ఎంత బలమైన కాంబినేషన్ సెట్ అయితే సినిమాపై అంత భారీ అంచనాలు పెరిగిపోతాయి. ఇక స్టార్ హీరోలకు సంబంధించి వారి ఫ్యామిలీ హరోలు కానీ.. వారి సొంత బ్యానర్లో కానీ సినిమా అనౌన్స్ అయినా అదే పరిస్థితి. దీనికి అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోవడం బోనస్ అని చెప్పాలి. టాలీవుడ్ లో అటువంటి పెద్ద ఫ్యామిలీల్లో ఒకటి నందమూరి ఫ్యామిలీ. వీరిలో బాలకృష్ణకు ఫ్యాన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ కుటుంబం నుంచి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హీరోలుగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరి ఫ్యామిలీ నుంచి ఓ మల్టీస్టారర్ వస్తుందని ఇండస్ట్రీలో వార్తలు రౌండ్ అవుతున్నాయి.
వరుస హిట్లతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా కన్ఫర్మ్ అయిందనే వార్త రెండు మూడు రోజులుగా బాగా వైరల్ అవుతోంది. దీనికి ‘రామారావు గారు’ అనే టైటిల్ ఇప్పటికే సెట్ చేశారని గతంలోనే వర్తలు వచ్చాయి. ఇందులో బాలకృష్ణతోపాటు కల్యాణ్ రామ్ కూడా నటిస్తాడని.. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోందని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ న్యూస్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచిందే గానీ జోష్ రాలేదు. అసలైన మల్టీస్టారర్ కావాలంటే బాలకృష్ణ-ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ చేయాలంటున్నారు. ఈమేరకు నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అభిమానుల ఆశలకు హద్దు ఉండదనే మాట తెలిసిందే.
నిజానికి నందమూరి అభిమానుల ఆకాంక్షే బాలయ్య-ఎన్టీఆర్ లను తెరపై కలిపి చూసుకోవాలని. ఈక్రమంలో బాలయ్యతో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా కల్యాణ్ రామ్ తో మల్టీస్టారర్ అనే గాసిప్ తో వారి ఆలోచనలన్నీ.. ఎన్టీఆర్ మీదకు వెళ్లిపోయాయి. బాలయ్య-ఎన్టీఆర్ మల్టీస్టారర్ అనే ఆలోచనే వారికి కిక్కు ఇస్తోంది. అయితే.. బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా వార్త అయితే వచ్చింది కానీ.. అది మల్టీస్టారరా? కాదా.. సినిమాకు బాలయ్య ఎస్ చెప్పారా? అనేది ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. కల్యాణ్ రామ్ నిర్మాతగా ఈ సినిమా ఉంటుందనే వార్త కూడా వచ్చింది. ఏదేమైనా.. బాలయ్య-ఎన్టీఆర్ మల్టీస్టారర్ అనే ఊహ మాత్రం ఫ్యాన్స్ కు మంచి జోష్ ఇస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!