శరత్ మాండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. జులై 29వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ డేట్ జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… రవి అన్నకి చిరంజీవి అంటే చాలా ఇష్టం. రవి అన్న కెరియర్ ప్రారంభంలో చిరంజీవి గారినీ ఆయన ఆదర్శంగా తీసుకుంటే.. నా కెరియర్ ప్రారంభంలో.. రవి అన్న నీ నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాలేదు. రవి అన్న గురించి మాట్లాడే అవకాశంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినట్లు నాని పేర్కొన్నారు.
రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ నన్ను తెగ బతిమిలాడాడు.. వేణు కామెంట్స్ వైరల్..!
ప్రతి తరానికి ఒకడుంటాడు. నేను అయ్యాను కదరా…మీరు ఎందుకు అవ్వరు.. ఆ రీతిగా నా కెరియర్ ప్రారంభంలో రవి అన్న నీ ఆదర్శంగా తీసుకున్నానని పేర్కొన్నారు. ఇదే సమయంలో చిరంజీవి గారి సినిమాలో రవితేజ నటిస్తున్న వీడియో చూడటం జరిగింది త్వరలోనే రవితేజతో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు నాని బహిరంగంగా చెప్పుకొచ్చారు. ప్రతి సినిమా తర్వాత రవి అన్న నుండి ఫోన్ వస్తది. ఏదైనా మంచి సినిమా విజయం సాధిస్తే కచ్చితంగా సదరు సినిమా యూనిట్ నీ.. అభినందిస్తారు. రవి అన్న మాటల్లో ఉండే స్వచ్ఛత.. ప్రేమ ఎంతగానో నచ్చుతుంది అని నాని పేర్కొన్నారు.
ఇక సీనియర్ హీరో వేణు గురించి నాని మాట్లాడుతూ అప్పట్లో హనుమాన్ జంక్షన్ సినిమాలో ఎల్బీ శ్రీరామ్ గారితో ఆవు ఎపిసోడ్ సీన్ ఎంతగానో ఇష్టమని పేర్కొన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు కచ్చితంగా మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను అని నాని తెలిపారు. కచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ నుండి పోస్టర్ విడుదలైన నాటినుండి పాజిటివ్ వాతావరణం కనిపిస్తుంది సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాట్లు “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా యూనిట్ అందరికీ నాని ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!