Pavitra Naresh: సినీ నటుడు నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ఎప్పటినుండ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించి గత కొంతకాలం నుండి సోషల్ మీడియాలో ఇంకా ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తమపై అసభ్యంగా వార్తలు రాసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పలు వెబ్ సైట్స్ పై వీరిద్దరు కేసు కూడా వేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే మరికొద్ది క్షణాలలో కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో ట్విట్టర్ వేదికగా నటుడు నరేష్ కీలక ప్రకటన చేశారు. పవిత్ర లోకేష్ నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
కొత్త సంవత్సరం కొత్త ప్రారంభం మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మీకందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇక ఇదే సందర్భంలో పవిత్ర లోకేష్ కి లిప్ కిస్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత న్యూ ఇయర్ కేక్ కట్ చేసి.. ఇద్దరూ ఒకరికి మరొకరు తినిపించుకున్నారు. వీడియో చివరిలో గెట్టింగ్ మ్యారీడ్ సూన్.. పవిత్ర నరేష్ అని క్లారిటీ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మా అధ్యక్షులు ఎన్నికల సమయంలో నరేష్.. పోటీ చేసిన తరుణంలో పవిత్ర లోకేష్ ప్రచారంలో కీలకంగా రాణించారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య.. రిలేషన్ నడుస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత నరేష్ భార్య పవిత్ర లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మాత్రమే కాదు దాడికి కూడా పాల్పడటం జరిగింది. ఈ క్రమంలో నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన రోజు నరేష్ తోనే పవిత్ర లోకేష్ ఉండటం… ఆ టైంలో పెద్ద హాట్ టాపిక్ అయింది. పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా న్యూ ఇయర్ కి ఒక రోజు ముందు నరేష్ తాను పవిత్ర లోకేష్ నీ పెళ్లి చేసుకోబోతున్నట్లు కామెంట్ పెట్టడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే పవిత్ర లోకేష్ కి ఇది రెండో పెళ్లి. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోవడం జరిగింది.
New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏From us to all of you #HappyNewYear ❤️
– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!