National Film Awards: ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో తమన్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చాలా సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. పాండమిక్ తర్వాత ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయినా చాలా సినిమాలలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. అఖండ, సర్కారు వారి పాట, క్రాక్, భీమ్లా నాయక్, డీజే టిల్లు సినిమాలు విజయం సాధించడంలో తమన్ ప్రముఖ పాత్ర పోషించారు.
ఇంకా కరోనా రాకముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో” సినిమాకి అందించిన మ్యూజిక్ తమన్ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమాలో పాటలు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా క్రియేట్ చేయండి రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో “అలా వైకుంఠపురంలో” సినిమాకి గాను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ తమన్ కి జాతీయ అవార్డు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానం చేశారు. తెలుగులో కలర్ ఫోటో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకుంది.
బెస్ట్ మేకప్, బెస్ట్ కొరియోగ్రాఫర్ విభాగాలలో నాట్యం సినిమా అవార్డులను కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకా ఇదే సమయంలో సురారై పొట్రు సినిమాకు జాతీయ ఉత్తమ నటుడుగా సూర్య, ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కుమార్, డైరెక్టర్ సుధా కొంగర అవార్డులను అందుకున్నారు. ఇంకా తానాజీ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అవార్డు అందుకోవటం జరిగింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!