NTR : తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు ఉన్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నందమూరి వారసుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ తాతకు తగ్గ మనవడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఎన్టీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.అందరి హీరోల మాదిరిగా తన సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాలను గురించి ఎప్పుడు అభిమానులతో పంచుకోరు.
ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి గురించి చాలా మందికి తెలియదు. అందరు హీరోలు వారి పిల్లలకు సంబంధించిన అల్లరి చేష్టలను, ముద్దు మాటలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటారు. కానీ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా పంచుకోరు. తన పిల్లల ఫోటోలను కూడా ఎప్పుడో ఏదైనా ప్రత్యేక రోజులలో మాత్రమే సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకులకు సంబంధించిన ఫోటోలను క్రిస్మస్ కానుకగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఎన్టీఆర్ కొడుకులను చూస్తే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. పిల్లలు ఎంతో అందంగా క్యూట్ గా ఉన్నారు.
ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులలో పెద్దకొడుకు అభయ్ రామ్ అచ్చం ఎన్టీఆర్ పోలికలతో కనిపిస్తే, చిన్న కొడుకు భార్గవ్ రామ్ తల్లి లక్ష్మీ ప్రణీత పోలికలతో ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా హీరో అల్లు అర్జున్ పిల్లలు, మహేష్ బాబు పిల్లలు ఎక్కువగా సందడి చేస్తుంటారు. వీరికి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ టైగర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చివరి దశలో షూటింగ్ జరుపుకోగ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే సమాచారం వినబడుతోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!