ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండల వీరుడుగా.. మంచి పేరు ఉన్న సల్మాన్ కెరియర్ పరంగా దూసుకుపోతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం వరుస పెట్టి పరాజయాలు అందుకున్న గాని ఆ తర్వాత పుంజుకొని ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధిస్తున్నాడు. అయితే వయసు పరంగా 57 సంవత్సరాలు ఉన్నా సల్మాన్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.
బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్ లతో సల్మాన్ ప్రేమాయణం సాగించడం జరిగింది. ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్… ఇంకా చాలామంది హీరోయిన్ లతో సల్మాన్ లవ్ ట్రాక్ నడిపారు. కానీ అనూహ్యంగా ఎవరితోనూ పెళ్లి కాలేదు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ పెళ్లి ఒక ప్రశ్నర్థకంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే పాకిస్తాన్ దేశానికి చెందిన హీరోయిన్ మీరా… సల్మాన్ ఖాన్ పై తనకున్న ప్రేమను తెలియజేసింది. సల్మాన్ ఓకే చెబితే పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తన మనసులో మాట బయట పెట్టేసింది.
సల్మాన్ ఖాన్ నీ పెళ్లి చేసుకోవాలని ఎప్పటినుండో నా కోరిక. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ స్టార్.. అంటూ పొగుడుతూ.. పాకిస్తాన్ హీరోయిన్ మీరా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీవీ ప్రజెంటర్ గా… కెరియర్ సాగిస్తున్న మీరా గతంలో పలు పంజాబీ సినిమాలలో హీరోయిన్ గా చేసింది. దీంతో మీరా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ “కబీ ఈద్ కబీ దివాళి” సినిమా షూటింగ్ చేస్తూనే మరోపక్క సౌత్ లో చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలో కీలక పాత్ర చేయడం జరిగింది. అంతేకాదు త్వరలో షారుక్ ఖాన్ తో సల్మాన్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో మీరా చేసిన కామెంట్స్ చర్చినీయాంశంగా మారాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!