మహేష్ ఫ్యాన్స్ బాటలోనే పవన్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్..??

Share

సినిమా రంగంలో తమ అభిమాన హీరో పుట్టినరోజు వచ్చిందంటే సదరు హీరో అభిమానులు పండగల చేయడం తెలిసిందే. దక్షిణాది సినిమా రంగంలో విపరీతంగా సినిమా హీరోలను అభిమానులు ఆదరిస్తుంటారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే ఏకంగా గుళ్ళు కూడా కట్టేస్తారు. ఇక తెలుగులో కూడా అంత కాకపోయినా గానీ దానధర్మాలు, భోజనాలు… పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టడం వంటివి జరుగుతుంటాయి. కానీ గత రెండు సంవత్సరాలు కరోనా ఉదృత ఎక్కువ ఉండటంతో ఎటువంటి సెలబ్రేషన్స్ జరగలేదు.

ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న మహేష్ బాబు గడ్డం న్యూ లుక్..!!

కానీ ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత తగ్గడంతో చాలా వరకు బయట పరిస్థితిలు అని మారిపోయాయి. ఇలాంటి తరుణంలో ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టినరోజు రావడంతో మహేష్ ఫ్యాన్స్.. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “పోకిరి” ప్రజెంట్ 4K టెక్నాలజీతో స్పెషల్ షో వేయించుకుంటున్నారు. “పోకిరి” నిర్మాతలను ఒప్పించి ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈషో పలు నగరాలలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో పవన్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా రెడీ అయ్యారు.

వచ్చే నెల రెండవ తారీకు పవన్ పుట్టినరోజు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా “జల్సా” లేటెస్ట్ టెక్నాలజీతో రూపుదిద్ది విడుదల చేయాలని నిర్మాతలను ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ప్రభాస్ కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ చిత్రం “వర్షం” 4K టెక్నాలజీతో విడుదల చేయాలని ప్రభాస్ పుట్టినరోజు నాడు స్పెషల్ షో వేయాలని.. ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారట. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని రీతిలో మహేష్ అభిమానులు.. విడుదల అయిపోయిన సినిమాని మళ్లీ కొత్త టెక్నాలజీతో విడుదల చేసే రీతిలో సరికొత్త ట్రెండ్ సృష్టించటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

55 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

58 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

4 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

6 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago