Pawan kalyan – Mahesh: మా పవన్, మహేశ్ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉందా..అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేసే వారి మీద మండిపడుతున్నారు. బాహుబలి తర్వాత టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ కోసమే తాపత్రయపడుతున్నారు. దీనికి ముందు నంబర్ 1 ప్లేస్ కోసం పోటీ పడే వారు. అప్పుడు అభిమానులు కూడా మా హీరోదే నంబర్ 1 ప్లేస్ అంటే మా హీరోదే నంబర్ 1 ప్లేస్ అని ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు అందరి దృష్ఠి పాన్ ఇండియన్ స్టార్ అనే క్రేజ్ తెచ్చుకోవడం మీదే ఉంది.
అయితే, ఇటీవల సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి భీమ్లా నాయక్ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ చేయమంటూ ట్వీట్ చేశారు. భీమ్లా నాయక్ పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కాదా అని కూడా వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. దీనికి నెటిజన్స్ కొందరు పవన్ కళ్యాణ్ అలాగే మహేశ్ బాబు ఇంకా పాన్
ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని ఆలోచించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారట. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్, చరణ్ కూడా పాన్ ఇండియన్ స్టార్స్‌గా మారిపోవడం ఖాయం.
Pawan kalyan – Mahesh: ఇండియన్ సినిమాలను ప్రకటిస్తే గానీ దీనికి ఫుల్ స్టాప్ పడదు.
మరి ఇంకా ఎందుకు పవన్, మహేశ్ పాన్ ఇండియన్ సినిమాలను చేయడం లేదనేదే కొందరి వాదన. అయితే వీరి అభిమానులు మాత్రం పాన్ ఇడియన్ సినిమా చేస్తేనే ఆ క్రేజ్ వస్తుందా..ఆ తరహా సినిమాలు చేయకుండానే మా హీరోలకు ప్రపంచ వ్యాప్తంగా అలాగే అన్నీ భాషలలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది కదా. పవన్ సినిమా గానీ, మహేశ్ సినిమా గానీ రిలీజైతే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి ఎలాంటిదో తెలిసిందే కదా..పాన్ ఇండియన్ సినిమాలు చేస్తేనే ఇలాంటి క్రేజ్ రాదు గా అని తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. ఒకరకంగా వారు చెప్పిందీ కూడా నిజమే. పోకిరి సినిమాతో మహేశ్ 75 ఏళ్ళ రికార్డులను బద్దలు కొట్టారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలిప్రేమ, ఖుషి, జల్సా, అత్తారింటికి దారేది..వకీల్ సాబ్ లాంటి సినిమాలు సృష్ఠించిన రికార్డులూ ఉన్నాయి. ఇంతకన్నా ఏం కావాలి అనేదే అభిమానులు వాదన. ఏదేమైనా త్వరలో పవన్ కళ్యాణ్, మహేశ్ పాన్ ఇండియన్ సినిమాలను ప్రకటిస్తే గానీ దీనికి ఫుల్ స్టాప్ పడదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!