Pawan Kalyan : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. దాదాపు మూడు సంవత్సరాల పాటు పవన్ సినిమా రాకపోయినా గాని.. ఇండస్ట్రీ టాప్ హీరోల స్థానంలో ఉంటూనే ఉన్నారు. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా సినిమాలు రాకపోవటం అంతకుముందు ఎలక్షన్ల ప్రచారంలో కీలకంగా రాణించడంతో బిజీగా ఉన్న పవన్ ఒకపక్క సినిమా కెరియర్ మరోపక్క పొలిటికల్ కెరియర్ బ్యాలెన్స్ చేస్తూ ప్రస్తుతం రాణిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో గత ఏడాది రిలీజ్ కావాల్సిన “వకీల్ సబ్” సినిమా ఈనెల 9వ తారీకు రిలీజ్ అవటానికి రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలా వరకు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేయటం గ్యారెంటీ అని అందరికీ తెలుసు. తమ అభిమాన హీరో సినిమా దాదాపు మూడు సంవత్సరాలు రాకపోవడంతో ఇతర హీరోల హడావిడి ఎక్కువవడంతో .. ఈ వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ తో రికార్డుల వేట స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా తన స్పీచ్ తో మరో సరికొత్త రికార్డు సృష్టించారు.
ఆదివారం ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. వేడుకల్లో భాగంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ ని దాదాపు 1.4 లక్షల మంది చూడటం జరిగింది. అంతకుముందు “అజ్ఞాతవాసి” సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక టైములో 1.3 లక్షల మంది పవన్ స్పీచ్ విన్నారు. ఇటువంటి తరహా లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో స్పీచ్ కి ఇంతగా ఆదరణ రాలేదు. దీంతో “వకీల్ సాబ్” రిలీజ్ వేడుక స్పీచ్ ద్వారా తన రికార్డును తానే పగలగొట్టడు పవన్ కళ్యాణ్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!