Prabhas: ఇపుడు ఎక్కడ విన్నా ‘డార్లింగ్’ ప్రభాస్ నటించిన సినిమాల గురించే చర్చ నడుస్తోంది. అందులో ఆది పురుష్ ఒకటి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ మైథలాజికల్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు కేవలం 103 రోజుల్లోనే ఆది పురుష్ షూటింగ్ పూర్తి చేసి వావ్ అనిపించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు పలు టెక్నికల్ వర్క్ పునులతో మూవీ టీం మస్తు బిజీగా ఉంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.
Lavanya Tripathi: నెటిజన్‌పై లావణ్య త్రిపాఠి ఆగ్రహం.. అంత మాటంటే మండదా మరి!
Prabhas: ప్రభాస్ శ్రీరాముడి పాత్ర లుక్ ఇదే..
ఇక అసలు విషయంలోకి వెళితే, డార్లింగ్ అభిమానులు ఇప్పటినుండే సదరు సినిమాకు సంబంధించి పోస్టర్లు క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మా డార్లింగ్ రాముడి పాత్రలో ఇలా ఉంటాడంటూ తమ తమ స్నేహితులకు షేర్ చేస్తున్నారు. అక్కడితో వారు ఊరుకుంటారా? లేదు.. అలా ఒక గ్రూప్ నుండి మరొక గ్రూప్ కి చేరి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తాయి. అవును… ఆది పురుష్లో ప్రభాస్ శ్రీరాముడిగా ప్రభాస్ ఇలా ఉండనున్నాడంటూ న్యూ లుక్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
Naga shaurya: హీరో నాగశౌర్యకు దెబ్బ మీద దెబ్బ.. `లక్ష్య` లాసెంతో తెలిస్తే మీరే పాపమంటారు!
ఫ్యాన్ మేడ్ చిత్రాల కహానీ..
ఏదైతేనేం, తమ అభిమాన హీరోను శ్రీరాముడి లుక్‌లో చూసుకుని ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. సదరు చిత్రాలను చుసిన కృ కూడా అద్భుతం అంటూ వారికి కితాబిస్తున్నారు. కాగా ఆదిపురుష్ మూవీ మొత్తం బడ్జెట్ రూ. 400 కోట్లు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. సుమారు 15 భారతీయ, అంతర్జాతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 20,000 థియేటర్లలో ఒకేసారి ఆదిపురుష్ రిలీజ్ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం సలార్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!