RC 15: రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గత ఏడాది నుండి జరుగుతోంది. దక్షిణాది సినిమా రంగంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న దర్శకుడు శంకర్ ఫస్ట్ టైం తెలుగు హీరో రామ్ చరణ్ తో సినిమా చేస్తూ ఉండటం.. సంచలనంగా మారింది. శంకర్ సినిమాలు చాలావరకు మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో ఉంటాయి. అదే జోనర్ తో రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తున్నారట. ఒకటి రాజకీయ నాయకుడిగా మరొకటి కలెక్టర్ పాత్రలో ఇంకొకటి స్టూడెంట్ పాత్రలో.. నటిస్తున్నారట.
దాదాపు ఏడాది నుండి సినిమా షూటింగ్ జరుపుకుంటున్న.. “RC 15” టైటిల్ ఫస్ట్ లుక్ విషయంలో… ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఫుల్ సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దిల్రాజు మాట్లాడుతూ..”తొందర్లోనే టైటిల్ అనౌన్స్ చేస్తారు. చరణ్ బర్త్ డే నాడు సినిమా టైటిల్ కి సంబంధించిన లోగో రిలీజ్ చేసేందుకు శంకర్ గారు ప్రస్తుతం డిజైన్ వర్క్స్ దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
ప్లానింగ్ ప్రకారం సంక్రాంతి రోజు రావచ్చు.. అని దిల్ రాజు తెలియజేయడం జరిగింది. ఈనెల 27వ తారీకు చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఆరోజు సోషల్ మీడియా షేక్ అవడం గ్యారెంటీ అని తాజా వార్త పై ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. “RRR” ఆస్కార్ రేసులో ఉండటంతో.. అక్కడ రకరకాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈనెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఆ తర్వాత చరణ్ ఇండియాకి చేరుకొనున్నారు.