JGM: డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో “జనగణమన” చేస్తున్న సంగతి తెలిసిందే. “జనగణమన” తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా పూరి గతంలో తెలియజేయడం జరిగింది. పాన్ ఇండియా నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మిలటరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ హీరోయిన్ తో సరికొత్త ప్రయోగాలు చేయడానికి రెడీ అయినట్లు టాక్.
మామూలుగా అయితే పూరి సినిమాలలో చాలా వరకు హీరోలు… హీరోయిన్ లనీ …ఒసేయ్..ఏంటే.. అంటూ కొద్దిగా నాటుగా మాట్లాడతారు. కానీ “జనగణమన” సినిమాలో ఫస్ట్ టైం పూరి జగన్నాథ్ హీరోయిన్ తో స్టంట్ లు చేయించబోతున్నరట. ఇందు కోసం స్పెషల్ గా ఒక ఫారినర్ దగ్గర ట్రైనింగ్ కూడా పూజా హెగ్డేకి పూరి జగన్నాథ్ ఇపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
మేటర్ లోకి వెళ్తే విజయ్ దేవరకొండతో పాటు… పూజా హెగ్డే కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలలో నటించాల్సిన పరిస్థితి. స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో.. పూజా హెగ్డే కూడా ఓకే చెప్పినట్లు టాక్. ఈ సీన్స్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. ఇదిలా ఉంటే పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా నటించిన “లైగర్” ఆగస్టు 25వ తారీకు రిలీజ్ కానుంది. డైరెక్టర్ పూరీ తో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ “లైగర్” కి సంబంధించి ప్రీ రిలీజ్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు. వరుస పరాజయాల లో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…