యాంకర్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రఘు కుంచె. ఈయన త్వరలోనే తనలోని మరో కోణాన్ని చూపించబోతున్నారు. ‘పలాస 1978’ మూవీలో రఘు కుంచె విలన్‌గా కనిపించబోతున్నారు. అది కూడా సాదా సీదా విలన్ పాత్ర కాదు. నాలుగు డిఫరెంట్ షేడ్స్ ఉన్న విలనీ పాత్ర అది. నటనకు బాగా స్కోప్ ఉన్న చాలెంజింగ్ పాత్ర చేయబోతున్నారీయన. ఒకపక్క విలనిజం పండిస్తూనే మరో పక్క ఈ సినిమా మ్యూజిక్ అందించడం మరో విశేషం. మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలోనే డైరెక్టర్ కరుణ కుమార్, విలన్ పాత్రకు రగుకుంచెను తీసుకోవాలనుకున్నారట. ఈ సినిమాలో 30-40-50-70 ఏజ్ లలో అతను కనపించబోతున్నారు. రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘పలాస 1978’ చిత్రం ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు దర్శక నిర్మాతలు.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!