దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు `RRR` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే.. రాజమౌళి మరో సినిమాకు సంబంధించిన వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. సూపర్‌స్టార్ మహేష్, రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందాల్సి ఉంది. కె.ఎల్.నారాయణ నిర్మాణంలో మహేష్ హీరోగా రాజమౌళి సినిమా ఉంటుందని చాలా రోజులుగా ఈ చిత్రంపై వార్తలు వినపడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు `RRR`తో బిజీగా ఉన్న రాజమౌళి.. ఇది ముగిసిన తర్వాతే మరో సినిమాను ట్రాక్ ఎక్కిస్తాడు. సమాచారం ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో 2006లో రూపొందిన `విక్రమార్కుడు` సినిమాకు సీక్వెల్‌గా మహేష్‌బాబు సినిమాను తెరకెక్కించనున్నాడంటున్నారు. అయితే ఓ సినిమా పూర్తి కాకముందే.. మరో సినిమా గురించి రాజమౌళి ఆలోచన చేయడు. కమిట్మెంట్ను పూర్తి చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా సినిమా లైన్‌ను అనుకుని ఉండొచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే మహేష్‌ను మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా తెరపై చూడొచ్చు.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!