‘ఆర్ఆర్ఆర్’కు మెగాస్టార్, సూపర్ స్టార్..! రాజమౌళి ప్లాన్ ఏంటో?

నేటి సినిమా తీరు మారిపోయింది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఎన్ని అదనపు హంగులు జోడిస్తే అంతగా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల లెక్క మారింది. స్టార్ హీరోలందరూ దాదాపు పాన్ ఇండియా క్రేజ్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. భారీ స్టార్ క్యాస్టింగ్ కి తోడు.. భారీ నిర్మాణ విలువలు. అలా.. తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ పై యావత్ భారత చలనచిత్ర పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్నంటాయి. సరికొత్త హంగులతో, అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పుడో లేటెస్ట్ గాసిప్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

rajamouli plans with mega star and super star
rajamouli plans with mega star and super star

’ఆర్ఆర్ఆర్’పై మరింత హైప్ పెంచేందుకు రాజమౌళి భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతూండడంతో.. ఆయా భాషల్లోని సూపర్ స్టార్స్ తో సినిమా నేపథ్యాన్ని వాయిస్ ఓవర్ ద్వారా చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో జోరుగా రౌండ్ అవుతోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, హిందీలో అమీర్ ఖాన్ ను ఇందుకు సంప్రదించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వార్తపై అఫీషియల్ న్యూస్ రాకపోయినా ఈ వార్త బాగా వైరల్ అయింది. ఈ వార్త నిజమైతే సినిమాకు మరింత ప్లస్ అవుతుందనే చెప్పాలి.

లగాన్ కు అమితాబ్, రుద్రమదేవికి చిరంజీవి, సైరా.. నరసింహారెడ్డికి పవన్ కల్యాణ్, జల్సాకు మహేశ్.. తమ వాయిస్ ఓవర్ తో సినిమాలను ఓ రేంజ్ లో ఉంచారు. ‘ఆర్ఆర్ఆర్’ కు వాయిస్ ఓవర్ అవసరం ఉంటే.. పైన చెప్పినట్టు ఆయా భాషల్లోని సూపర్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. ఈ వార్తపై నిజానిజాలేంటో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మాత్రమే రివీల్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ దశలో ఉంది. ఏకధాటిగా జరిగే షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు.