KGF 2: “కేజిఎఫ్ 2” సూపర్ డూపర్ హిట్ కావడంతో నిర్మాతలకు భారీ లాభాలు వస్తున్నాయి. దేశంలోనే అతి చిన్న ఇండస్ట్రీ గా పిలవబడే కన్నడ ఇండస్ట్రీ నుండి దేశాన్ని షేక్ చేసే రీతిలో “కేజిఎఫ్ 2″ సత్తా చాటుతోంది. హీరో యాష్ … డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేర్లు మారు మ్రోగుతున్నాయి. రాజమౌళి మాదిరిగానే ప్రశాంత్ నీల్… దర్శకత్వ పని తీరు ఉందని..”కేజిఎఫ్ 2” చూసినవాళ్లు అంటున్నారు. సామాన్య ప్రేక్షకులు అయితే.. భారతీయ చలన చిత్ర రంగం యొక్క స్థాయిని ఇద్దరు దర్శకులు పెంచేశారని ప్రశంసిస్తున్నారు. ఇద్దరూ కూడా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారు కావడం విశేషం అని మరి కొందరు అంటున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ “కేజిఎఫ్ 2” టీం నీ పొగడ్తలతో ముంచెత్తారు. రజినీకాంత్ కి సినిమా నచ్చితే కచ్చితంగా సదరు నిర్మాతలకు లేదా ఆర్టిస్టులకు నేరుగా ఫోన్ చేసి అభినందిస్తారు. ఇప్పుడు ఇదే రీతిలో “కేజిఎఫ్ 2” చూసిన తర్వాత నిర్మాతకు ఫోన్ చేసి ప్రశంసించారట. “కేజిఎఫ్ 2” బాగా తీశారు అని అందరిని మెచ్చుకున్నారట. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. రజిని ప్రస్తుతం రెండు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
అందులో ఒకటి “బీస్ట్” సినిమాని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒకటి. మరొకటి అరుణ్ రాజ్ కామరాజ.. దర్శకత్వంలో మరో సినిమా చేయాలని రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టులు స్టార్ట్ కానున్నాయి. “కేజిఎఫ్ 2” తమిళ్ లో కూడా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించడం జరిగింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ “బీస్ట్” మూవీ ఫ్లాప్ కావడంతో..”కేజిఎఫ్ 2″ కి తమిళ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పరిణామంతో…”కేజిఎఫ్ 2″ కోసం మరికొన్ని సినిమా థియేటర్లు పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!