పంజాబీ సొగసరి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగణ్, టుబులతో కలిసి రకుల్ నటించిన చిత్రం ‘దే దే ప్యార్ దే’. ఈ సినిమాలో రకుల్ నటించిన ఓ పెళ్లి సాంగ్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా రకుల్ లుక్ కుర్ర కారుకి కిక్ ఎక్కిస్తుందని కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ లుక్ రావడానికి రకుల్ చాలానే కష్టపడిందట. దర్శకుడు అకివ్ తనకు ‘కాక్టెయిల్’ చిత్రంలో దీపికా పదుకొనె లుక్‌లో సన్నగా కనపడాలని చెప్పడంతో… స్ట్రిట్ డైట్‌ను ఫాలో అయ్యి 10 కిలోల బరువు తగ్గిందట రకుల్.
previous post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!