Rakul: సాధారణంగా సెలబ్రెటీలు తమ లవ్ ఎఫైర్స్‌ను చాలా అంటే చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. కానీ, అందుకు రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా భిన్నం. గత ఏడాది తన బర్త్‌డే సందర్భంగా రకుల్ బాలీవుడ్లో నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు ఓపెన్‌గానే అనౌన్స్ చేసింది. అంతేకాదు, జాకీతో తరచూ షికార్లకు వెళ్తూ వార్తల్లో నిలుస్తోంది.
అయితే తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. బాయ్‌ఫ్రెండ్ విషయాన్ని గోప్యంగా ఉంచకపోవడానికి కారణం ఏంటీ..? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు రకుల్ బదులిస్తూ.. గుట్టు మొత్తం రట్టు చేసేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. `వ్యక్తిగత విషయాలను దాచడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
కెరీర్‌తోనే తీరిక లేని నేను జాకీతో ప్రేమ ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఒత్తిడికి గురవ్వడం అస్సల ఇష్టం లేదు. అయినా మరొకరి వ్యక్తిగత జీవితాల గురించి ఇతరులకు ఇంత ఆసక్తి ఎందుకో అర్థం కాదు. తల్లి దండ్రులు, అన్నా చెల్లి ఉన్నట్లే మనకో తోడు ఉంటారు. అందులే వింతేముంది.` రకుల్ చెప్పుకొచ్చింది.
దీంతో ఇప్పుడీమె కాంమెట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. రకుల్ తెలుగులో సినిమాలేమి చేయకపోయినా బాలీవుడ్లో మాత్రం వరుస ప్రాజెక్ట్స్‌ను టేకప్ చేస్తోంది. ఈమె నటించిన రన్ వే 34, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ జి, థాంక్ గాడ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఆమె సోలో లీడ్‌గా `ఛత్రవాలి` అనే మూవీలో నటిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!