Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కేరటం` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ భామ.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయకపోయినా.. బాలీవుడ్లో మాత్రం వరుస చిత్రాలు చేస్తూ అక్కడ మస్తు బిజీగా గడుపుతోంది.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్న`రన్ వే-34`, అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో `థ్యాంక్ గాడ్`, ఆయుష్మాన్ ఖురానా సరసన `డాక్టర్ జీ`, అటాక్‌తో పాటు మరొక చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది.
అయితే ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్‌గా ఉండే రకుల్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫొటోలతో తన ఫాలోవర్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటుంది.
ఇక తాజాగా గ్రీన్ కలర్ టాప్, వైట్ జీన్స్ ధరించిన రకుల్.. హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ `నేను మరియు భూమి స్నేహితులం.. మరీ మీరూ?` అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
దీంతో ఆమె పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ పిక్స్‌లో రకుల్ జీరో సైజ్ అందాలు చూస్తే ఎవ్వరైనా పిచ్చెక్కిపోతారు. అంత అందంగా ఆమె కనిపిస్తోంది. మరి రకుల్ తాజా పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!