టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ కు పెద్ద కథే ఉంది. ఈ కథ అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వేసిన దారిలో నాగబాబు నుంచి కల్యాణ్ దేవ్ వరకూ అందరూ టాలీవుడ్ లో స్ధిరపడ్డారు. చిరంజీవికి ఉన్న తిరుగులేని ఇమేజ్, అప్రతిహత ఫ్యాన్ బేస్ తోనే ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలకు బేస్ అవుతుంది. అలా వచ్చి తమ టాలెంట్ నిరూపించుకుంటూ మెగా హీరోలుగా చిరంజీవి పేరు నిలబెడుతున్నారు. వీరిలో రామ్ చరణ్ ప్రత్యేకం. చిరంజీవి వారసుడిగా అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఆ అంచనాలను నిలబెట్టడుతూ.. కాపాడుకుంటూ తిరుగులేని రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. రామ్ చరణ్ కిరీటంలో ఇప్పుడు మరో రికార్డు వచ్చి చేరింది.
సినిమాల్లో రామ్ చరణ్ రికార్డులు గురించి తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలో 1మిలియన్ ఫాలోవర్స్ ను సాధించి అద్భుత రికార్డు సెట్ చేశాడు. నిజానికి మిగిలిన టాలీవుడ్ హీరోలతో పోలిస్తే ఇది పెద్ద రికార్డు కాదు. కానీ.. అతి తక్కువ సమయంలో.. కేవలం 233 రోజుల్లో ఈ రికార్డు సాధించి టాలీవుడ్ లో తొలి హీరోగా, దక్షిణాదిన సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇదేమంత సామాన్యమైన విషయం కాదు. దీంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేస్తున్నారు.
ఫాస్టెస్ట్ 500k ఫాలోవర్స్, మిలియన్ ఫాలోవర్స్ లేకుండానే 100k లైక్డ్ ట్వీట్స్.. ఇలా సోషల్ మీడియాలో తమ హీరో రికార్డులను చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అయింది. రెండో సినిమా మగధీరతో సౌత్ ఇండియా అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసాడు రామ్ చరణ్. యావరేజ్, ఫ్లాప్ సినిమాలతో కూడా మినిమం కలెక్షన్లు రాబట్టాడు. రంగస్థలంతో మరో నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసి నటనలో కూడా తన సత్తా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!