21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
Entertainment News సినిమా

GodFather: “గాడ్ ఫాదర్” లో సల్మాన్ చేసినందుకు ఆయన రుణం ఆ రకంగా తీర్చేసుకున్న రామ్ చరణ్..?

Share

GodFather: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “గాడ్ ఫాదర్” మరో రెండు రోజుల్లో థియేటర్ లో విడుదల కానుంది. మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు హిందీ తమిళం మలయాళం భాషలలో ఈనెల 5వ తారీఖు విడుదల కానుంది. మలయాళం లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన “లూసిఫర్”కి రీమేక్ గా “గాడ్ ఫాదర్” తెరకెక్కటం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో చిరంజీవి మాట్లాడుతూ సల్మాన్ నీ ఒప్పించడంలో రామ్ చరణ్ బాధ్యత తీసుకున్నారని తెలియ చెప్పడం తెలిసిందే.

Ram Charan is the one who has paid Salman's debt
GodFather

అంతేకాదు.. “గాడ్ ఫాదర్” స్టోరీ వినకుండానే తన పాత్ర ఏంటో కూడా అడగకుండా సల్మాన్ ఒప్పుకోవడం జరిగింది అని చిరు తెలియజేశారు. అంతేకాదు సినిమా షూటింగ్ ఎప్పుడంటే అప్పుడు సల్మాన్ ఖాన్ అందుబాటులో ఉండేవారని ఇటీవల ముంబైలో ప్రమోషన్ కార్యక్రమంలో చిరంజీవి తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పుడు “గాడ్ ఫాదర్” సినిమాలో సల్మాన్ చేసినందుకు రుణంగాను.. రామ్ చరణ్ సల్మాన్ కొత్త సినిమాలో స్టెప్పులు వేయడం జరిగిందంట.

Ram Charan is the one who has paid Salman's debt
GodFather

“కీసిక భాయ్ కిసీగా జాన్” లో సల్మాన్ ఇంకా వెంకటేష్ నటిస్తూ ఉండటంతో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఇద్దరు హీరోలతో చరణ్ స్టెప్పులు వేయడం జరిగిందంట. ఈ రకంగా సల్మాన్ రుణం చరణ్ తీర్చుకున్నట్లు టాక్. మెగాస్టార్ కుటుంబానికి సల్మాన్ ఖాన్ ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. గతంలో చరణ్ “జంజీర్” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే టైంలో సల్మాన్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఆయన స్పెషల్ రోల్ చేయటం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.


Share

Related posts

Prabhas: ప్రభాస్ + బాలివుడ్ హీరోల అందర్నీ దాటి నెంబర్ వన్ పొజిషన్ లోకి మహేష్ బాబు.!

Ram

Happy Birthday Ananya

Gallery Desk

ఇలాంటి వెబ్ సిరీస్ లతో ఎవరికి లాభం ..?

GRK